Ambedkar Childhood in Telugu

అది మన దేశానికి మధ్యలో ఉండే రాష్ట్రం.
అదే మధ్యప్రదేశ్ లోని అంబవాడలో 1891వ సంవత్సరంలో
ఓ తక్కువ కులం అనబడే ఒక కులానికి చెందిన వారికి ఓ బాలుడు జన్మించాడు.
అది కూడా వారికి 14వ సంతానం ఆయన.
ఆయన చిన్నప్పుడు చదువుకోవడానికి పాఠశాలకు వెళితే బయటే కూర్చోబెట్టేవారు.
అందరితో అస్సలు కలవనిచ్చే వారు కాదు.
అంతేకాదు తనకు ఒక వేళ దాహం నీళ్లు తాగాలనిపిస్తే,
అక్కడ పని చేసే గుమాస్తా కొంత ఎత్తులో నుండి తన చేయి పొత్తిళ్లలోకి నీళ్లు పోసేవాడు.
ఆ రోజుల్లో అంటరానితనం అత్యంత దారుణంగా ఉండేది.
ఇలాంటి పరిస్థితులే ఆయనలో చైతన్యం కలిగేలా చేశాయి.
అతని మెదడుపై తీవ్ర ప్రభావం చూపాయి.
అందుకే తన ఆత్మవిశ్వాసంతో అందరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు.
అందరూ సమానమనే భావన తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు.
ఆయనెవరో కాదు బాబా సాహెబ్ అంబేద్కర్.
ఏప్రిల్ 14వ తేదీ ఆయన పుట్టినరోజు.
ఈయనను బాబా సాహెబ్ అని కూడా పిలుస్తూ ఉంటారు.
అంబేద్కర్ మన దేశంలో అంటరానితనాన్ని పూర్తిగా పారదోలేందుకు చాలా ఎక్కువగా ఆలోచించేవాడు.
ఇందుకోసం 1927 సంవత్సరంలో ఒక ఉద్యమం మొదలుపెట్టాడు.
దేవాలయాల్లోకి అంటరాని వారు ప్రవేశించడానికి అవకాశం కలిగించాలంటూ,
అది వారి హక్కు అంటూ పోరాడాడు.
ఇలా ఎన్నో ఉద్యమాలు చేసాడు. వీటన్నింటి వల్ల ఈయనను అభిమానించేవారు రోజు రోజుకు పెరిగిపోయారు.
1930 సంవత్సరంలో కల్ రామ్ దేవాలయ సత్యాగ్రహాన్ని ప్రారంభించాడు.
Ambedkar Childhood in Telugu