Menu Close

Amarudavu Neevu Na Yesayya Lyrics In Telugu – Telugu Christian Songs

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

Amarudavu Neevu Na Yesayya Lyrics In Telugu – Telugu Christian Songs

అమరుడవు నీవు నా యేసయ్యా
ఆదియు అంతము నీవేనయ్యా
ఆదిలోనున్న నీ వాక్యమే
ఆదరించెను శ్రమకొలిమిలో

సొమ్మసిల్లక సాగిపోదును
సీయోను మార్గములో
స్తోత్రగీతము ఆలపింతును
నీదివ్య సన్నిధిలో

శక్తికి మించిన సమరములో
నేర్పితివి నాకు నీ చిత్తమే
శిక్షకు కావే శోధనలన్నీ
ఉన్నత కృపతో నను నింపుటకే

ప్రతి విజయము నీకంకితం
నాబ్రతుకే నీ మహిమార్థం
లోకమంతయు దూరమైనను
ననే చేరదీసెదవు
దేహమంతయు ధూళయైనను
జీవింపజేసెదవు

అమరుడవు నీవు నా యేసయ్యా
ఆదియు అంతము నీవేనయ్యా
ఆదిలోనున్న నీ వాక్యమే
ఆదరించెను శ్రమకొలిమిలో

వేకువకురిసిన చిరుజల్లులో
నీకృప నాలో ప్రవహించగా
పొందితినెన్నో ఉపకారములు
నవనూతనమే ప్రతిదినము

తీర్చగలనా నీ ఋణమును
మరువగలనా నీప్రేమను
కన్నతండ్రిగ నన్నుకాచి
కన్నీరు తుడిచితివి
కమ్మనైన ప్రేమ చూపి
కనువిందు చేసితివి ||అమరుడవు||

జల్దారు వృక్షమును పోలిన
గుణశీలుడవు నీవేనయ్యా
మరణము గెలిచిన పరిశుద్ధుడవు
పునరుత్థానుడవు నీవయ్యా

జయశీలుడవు నీవేనని
ఆరాధింతును ప్రతి నిత్యము
గుండె గుడిలో నిండినావు నీకే ఆరాధన
ఆత్మదీపము వెలిగించినావు నీకే ఆరాధన

అమరుడవు నీవు నా యేసయ్యా
ఆదియు అంతము నీవేనయ్యా
ఆదిలోనున్న నీ వాక్యమే
ఆదరించెను శ్రమకొలిమిలో

Amarudavu Neevu Na Yesayya Lyrics In Telugu – Telugu Christian Songs

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading