Menu Close

క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సిరీస్ – Adolescence – Web Series Recommendation – 2025


క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సిరీస్ – Adolescence – Web Series Recommendation – 2025

క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సిరీస్ “అడోలసెన్స్”: ఈ కథను స్టీఫెన్ గ్రాహం అందించగా, ఆయన ఈ సిరీస్‌లో నటించాడు కూడా. ఫిలిప్ బరంతిని దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో ఓవెన్ కూపర్, ఎరిన్ డొహెర్టీ, అష్లీ వాల్టర్స్, ఫయె మార్సే, క్రిస్టిన్ ట్రేమార్కో తదితరులు కీలక పాత్రలు పోషించారు.

క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సిరీస్ - Adolescence - Web Series Recommendation - 2025

రెండో అభిప్రాయం తప్పనిసరి | Telugu Moral Stories

ఈ సిరీస్ ప్రధానంగా 13 ఏళ్ల జేమీ మిల్లర్ అనే అబ్బాయి చుట్టూ తిరుగుతుంది. తన క్లాస్‌మేట్ అయిన అమ్మాయిని హత్య చేసిన అనుమానంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. రిమాండ్‌లో ఉన్న జేమీ వద్ద నిజాలు వెలికితీయడానికి ప్రత్యేక విచారణ జరుగుతుంది. ఈ దర్యాప్తులో ప్రొఫెషనల్ సైకియాట్రిస్ట్ సహాయం తీసుకుని జేమీ మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటారు. జేమీ చెప్పిన నిజాలే ఈ కథకు ముడి పడి ఉంటాయి.

ఈ మినీ సిరీస్‌ మొత్తం నాలుగు ఎపిసోడ్స్ ఉండగా, ఒక్కో ఎపిసోడ్ దాదాపు ఒక గంట పాటు ఉంటుంది. మార్చి 13న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన అడోలసెన్స్ మొదటి రోజే ట్రెండింగ్‌లోకి వచ్చి, ప్రపంచవ్యాప్తంగా టాప్ 1 వెబ్ సిరీస్‌గా గుర్తింపు పొందింది. విడుదలైన తొలివారంలోనే ఈ సిరీస్‌ 20 మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించగా, 11 రోజుల్లో 66.3 మిలియన్ వ్యూస్‌ను సంపాదించింది.

రెండు వారాలు పూర్తవుతున్నా “అడోలసెన్స్” నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండింగ్‌లో ముందంజలో కొనసాగుతోంది. భారతదేశంలోని టాప్ ట్రెండింగ్ టీవీ షోలలో ఇది రెండవ స్థానంలో నిలిచింది. ఐఎమ్‌డీబీలో ఈ సిరీస్‌కు 10లో 8.4 రేటింగ్ లభించింది, ఇది దాని సక్సెస్‌కి మరో నిదర్శనం.

దర్శకుడు దేవ కట్టా ప్రశంసలు: టాలీవుడ్‌లో ప్రస్థానం, రిపబ్లిక్ వంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన దేవ కట్టా కూడా ఈ సిరీస్‌ను ఎంతో ప్రశంసించారు. “అడోలసెన్స్ అద్భుతంగా ఉంది. తప్పకుండా చూడండి” అంటూ ఆయన సోషల్ మీడియాలో ప్రశంసలు తెలిపారు.

అడోలసెన్స్ దశలో పిల్లలు అనుసరించే ప్రవర్తన, వారి మానసిక స్థితి, సోషల్ మీడియా ప్రభావం వంటి సామాజిక అంశాల ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.

లైఫ్ చేంజింగ్ స్టోరీ | Life Changing Stories in Telugu

Like and Share
+1
1
+1
1
+1
0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading