Menu Close

Abhi Vandanam Yama Rajagrani Lyrics In Telugu – Yamaleela

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Abhi Vandanam Yama Rajagrani Lyrics In Telugu – Yamaleela

ధుం తత ధుం తత ధుం… ఆ ఆ ఆ తత ధుం
ధుం తత ధుం తత ధుం… ఆ ఆ ఆ తత ధుం
ధుం తత ధుం తత ధుం… ఆ ఆ ఆ తత ధుం

ధర్మపరిరక్షణా ధురంధరుండా
సకలపాప శిక్షణా దక్షుండా
చండతర దండతర బాహుమండిత నిగ్రహుండా
నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలనా నియముండా
హహ్… యముండా..!!

అభివందనం యమ రాజాగ్రణీ
సుస్వాగతం సుర చూడామణీ
తమ సుగుణాలు పలుమారు కీర్తించనీ
ఆఆ ఆఆ… ఆఆఆ ఆఆఆఆ

ఏమీ శహబాస్..!
శహబాసులే నర నారీమణీ
బహుబాగులే సుకుమారీమణీ
నిను మెచ్చాను వచ్చాను రారమ్మనీ
ఆఆ ఆఆ ఆఆ… ఆఆఆ ఆఆఆఆ

ధుం తత ధుం తత ధుం… ఆ ఆ ఆ తత ధుం
ధుం తత ధుం తత ధుం… ఆ ఆ ఆ తత ధుం
ధుం తత ధుం తత ధుం… ఆ ఆ ఆ తత ధుం

స గ ప మ పా ని ని ప మ గ మ గ
గ మ గ మ ప మ ప ని స ని ప మ పా
సరసాలు చవిచూడ ఇటురా దొరా
నవమన్మథాకార నడుమందుకోరా
ధుం తత ధుం తత ధుం… ఆ ఆ ఆ తత ధుం
రాకాసి కింకరుల రారాజునే
నరకాన నీవంటి సరుకెపుడు కననే
పాపాలు తెగ మోసి తల మాసెనేమో
నా పాలబడి కాస్త సుఖమందుకోవోయ్…
ఓ ఓ ఆఆ… ఆఆ ఆఆ ఆఆ

అవశ్యము..! అటులనే కానిమ్ము
నీ కౌగిలే నవ సింహాసనం
రసలోకమే ఇక మన కాపురం
యమ సరదాగా సాగాలి ఈ సంబరం…
ఆఆ ఆఆ… ఆఆ ఆఆ ఆఆ
ధుం తత ధుం తత ధుం… ఆ ఆ ఆ తత ధుం
ధుం తత ధుం తత ధుం… ఆ ఆ ఆ తత ధుం

ఊర్వశికి నీవేమి కజినవుదువా
కాకున్న నీకింత సౌందర్యమేల
ధుం తత ధుం తత ధుం… ఆ ఆ ఆ తత ధుం
నరలోకమున ఊరి కొక ఊర్వశి
స్వర్గాలే దిగివచ్చు మా కులుకు చూసి
ఊరించకే ఇక నా రాజహంస
యమహాయి నీదేలే రసికావతంస…
ఆఆ ఆఆ… ఆఆ ఆఆ ఆఆ

రసికాగ్రేసరుండా..! యముండా
మైకాలలో తమ మతిపోవగా
నా కేళిలో పడి మునకేయగా
గద వదిలేసి ఒడిలోకి రాదేవరా
ఆఆ ఆఆ… ఆఆ ఆఆ ఆఆ

మజ్జారే మదవతీ…!!
శహబాసులే నర నారీమణీ
బహుబాగులే సుకుమారీమణీ
నిను మెచ్చాను వచ్చాను రారమ్మనీ
ఆఆ ఆఆ… ఆఆ ఆఆ ఆఆ

ధుం తత ధుం తత ధుం… ఆ ఆ ఆ తత ధుం ||3||
ధర్మపరిరక్షణా ధురంధరుండా
సకలపాప శిక్షణా దక్షుండా
చండతర దండతర బాహుమండిత నిగ్రహుండా
నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలనా నియముండా
హహ్… యముండా..!!

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading