ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Konda konallo Lyrics in Telugu – Swathi Kiranam
కొండా కోనల్లో ..ఓ ..లోయల్లో.. గోదారి గంగమ్మ.. ఆ.. శాయల్లో
కొండా కోనల్లో ..ఓ ..లోయల్లో.. గోదారి గంగమ్మ.. ఆ.. శాయల్లో
కోరి కోరి కూసింది కోయిలమ్మ
కోరి కోరి కూసింది కోయిలమ్మ.. ఈ.. కోయిలమ్మ
కొండా కోనల్లో ..ఓ ..లోయల్లో.. గోదారి గంగమ్మ.. ఆ.. శాయల్లో
గోదారి గంగమ్మ.. ఆ.. శాయల్లో
నేలా పల్లవి పాడంగా నీలి మబ్బు ఆడంగా
రివ్వున గువ్వే సాగంగా నవ్వే మువ్వై మ్రోగంగా
నేల పల్లవి పాడంగా నీలి మబ్బు ఆడంగా
రివ్వున గువ్వే సాగంగా నవ్వే మువ్వై మ్రోగంగా
ఉంగా ఉంగా రాగంగా ఉల్లాసాలే ఊరంగా
ఉంగా ఉంగా రాగంగా ఉల్లాసాలే ఊరంగా
ఊపిరి ఊయలలూగంగా రేపటి ఆశలు తీరంగ
తెనుగుదనము నోరూరంగా తేటగీతి గారాబంగ
తెనుగుదనము నోరూరంగా.. తేటగీతి గారాబంగ
తెమ్మెరపై ఊరేగంగ వయ్యారంగా..
కొండా కోనల్లో ..ఓ ..లోయల్లో.. గోదారి గంగమ్మ.. ఆ.. శాయల్లో
గోదారి గంగమ్మ.. ఆ.. శాయల్లో
ఝుమ్మని తుమ్మెద తీయంగా కమ్మని రాగం తీయంగా
జాజిమల్లి సంపెంగా జానపదాలే విప్పంగ
కమ్మని రాగం తీయంగా జానపదాలే విప్పంగ
చెట్టుపుట్టా నెయ్యంగ చెట్టపట్టాలెయ్యంగ
చెట్టుపుట్టా నెయ్యంగ చెట్టపట్టాలెయ్యంగ
చిలకా పలుకులు చిత్రంగా చిలికే తేనెలు చిక్కంగా
ఏటిపాట లాలించంగా తోటతల్లి లాలించంగా
ఏటిపాట లాలించంగా తోటతల్లి లాలించంగా
స్వరాలన్ని దీవించంగ సా..వా..సంగా..
కొండా కోనల్లో ..ఓ ..లోయల్లో.. గోదారి గంగమ్మ.. ఆ.. శాయల్లో
గోదారి గంగమ్మ.. ఆ.. శాయల్లో
లోయల్లో.. శాయల్లో.. లోయల్లో.. శాయల్లో..
Konda konallo Lyrics in English – Swathi Kiranam
konda konalo loyalo godaree gangama sayalo
koree koree kooseendee koyeelama
koree koree kooseendee koyeelama ee koyeelama
konda konalo loyalo godaree gangama sayalo
godaree gangama sayalo
nela palavee padanga neelee mabboo adanga
reevvoona goovve sagamga navve moovvayee mroganga
nela palavee padanga nelee mabboo adanga
reevvoona goovve sagamgasavve moovvayee mroganga
oonga oonga raganga oolasale ooranga
oonga oonga raganga oolasale ooranga
oopeeree ooyala looganga repatee asaloo teeranga
tenoogoodanamoo gorooranga tetageetee garabamga
tenoogoodanamoo gorooranga tetageetee garabamga
temerapaee vooreganga vayyaranga
jhoomanee toomeda teeyanga kamanee ragam teeyanga
jajeemale sampenga janapadale neenpanga
kamanee ragam teeyanga janapadale neenpanga
chettookootta neyyamga chettapatta leyyamga
chettookootta neyyamga chettapatta leyyamga
cheelaka palookooloo cheetramga cheeleeke teneloo cheekkamga
yeteepata laleenchanga totatalee laleenchanga
yeteepata laleenchanga totatalee laleenchanga
swaralannee deeveenchaga savasanga..
loyalo sayalo loyalo sayalo