ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Niluvave Valukanuladana Lyrics in Telugu – Illarikam
నిలువవే వాలు కనులదానా
వయ్యారి హంస నడకదానా
నీ నడకలో హోయలున్నదె జాణ
నువ్వు కులుకుతు ఘలఘల నడుస్తువుంటే
నిలువదె నా మనసు..ఓ లలనా..అదినీకే తెలుసు
నిలువవే వాలు కనులదానా
వయ్యారి హంస నడకదానా
నీ నడకలో హోయలున్నదె జాణ
ఎవరని యెంచుకోనినావో పరుడని భ్రాంతి పడినావో
ఎవరని యెంచుకోనినావో పరుడని భ్రాంతి పడినావో సిగ్గుపడి తోలగేవో
విరహగ్నిలో నన్ను త్రోసి పోయేవో
నువ్వు కులుకుతు ఘలఘల నడుస్తువుంటే
నిలువదె నా మనసు..ఓ లలనా..అదినీకే తెలుసు
ఒకసారి నన్నుచూడరాదా చెంతచేర సమయం ఇదికాద
ఒకసారి నన్నుచూడరాదా సమయం ఇదికాద చాలునీ మరియాద
వగలాడినే నీ వాడనేకాద
నువ్వు కులుకుతు ఘలఘల నడుస్తువుంటే
నిలువదె నా మనసు..ఓ లలనా..అదినీకే తెలుసు
మగడంటే మోజులేనిదానా మనసుంటే నీకు నేను లేనా
మగడంటే మోజులేనిదానా నీకు నేను లేనా కోపమా నా పైనా
నీ నోటిమాటకు నోచుకోలేనా
నిలువవే వాలు కనులదానా
వయ్యారి హంస నడకదానా
నీ నడకలో హోయలున్నదె జాణ
నువ్వు కులుకుతు ఘలఘల నడుస్తువుంటే
నిలువదె నా మనసు
ఓ లలన..ఓ చెలియా..ఓ మగువా..అది నీకే తెలుసు