ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Karulo Shikarukelle Lyrics in Telugu – Thodi Kodallu
కారులో షికారు కెళ్ళే
పాలబుగ్గల పసిడిదాన
బుగ్గలమీద గులాబి రంగు
ఎలా వచ్చెనో చెప్పగలవా
నిన్ను మించిన కన్నెలెందరో
మండుటెండలో మాడుతుంటే
వారి బుగ్గల నిగ్గు నీకు
వచ్చి చేరెను తెలుసుకో
కారులో షికారు కెళ్ళే
పాలబుగ్గల పసిడి చానా
నిలిచి విను నీ బడాయి చాలు
తెలుసుకో ఈ నిజా నిజాలు
చలువ రాతి మేడలోన
కులుకుతావే కుర్రదానా
మేడకట్టిన చలువరాయి
ఎలా వచ్చెనో చెప్పగలవా
కడుపు కాలే కష్టజీవులు
ఒడలు విరిచి గనులు తొలిచి
చెమట చలువను చేర్చి రాళ్ళను పేర్చినారు తెలుసుకో “కారులో షికారు”
గాలిలోనా తేలిపోయే చీరకట్టిన చిన్నదానా “2”
జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా
చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు
చారిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింక తెలుసుకో “కారులో షికారు”