Menu Close

Nuvvu Nenu Kalisuntene Lyrics in Telugu – Gangotri


Nuvvu Nenu Kalisuntene Lyrics in Telugu – Gangotri

లాలలలాల…. లాలలలాల…. లాలలాలాలా…. 
లలలాలా  లలలాలా లల లాలాలాలాలా
నువ్వునేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం 
నువ్వునేను  మనమైతేనే ఇంకెంతో ఇష్టం
నువ్వునన్ను ప్రేమించావని నేన్నిన్ను ప్రేమించానని తెలిసాకా….
నువ్విక్కడుండి నేనక్కడుంటే   
నువ్విక్కడుండి నేనక్కడుంటే    ఎంతో కష్టం… ||నువ్వు||

ఎగరేసిన గాలిపటాలే ఎదలోతుకు చేరుతాయని
రుచిచూసిన కాకిఎంగిళ్ళే అభిరుచులను కలుపుతాయని
తెగతిరిగిన కాలవగట్లే కధ మలుపులు తిప్పుతాయని
మనమాడిన గుజ్జనగూళ్లే ఒకగూటికి చేర్చుతాయని
లాలించి పెంచినవాడే ఇకపై నను పరిపాలిస్తాడని తెలిసాకా….
నువ్విక్కడుండి నేనక్కడుంటే 
నువ్విక్కడుండి నేనక్కడుంటే   ఎంతో కష్టం ||నువ్వు||

ఆ బడిలో పాఠాలే మన ప్రేమని దిద్దుతాయని
ఆ రైలు పట్టాలే పల్లకిని పంపుతాయనీ…
రాళ్లల్లో మన పేర్లే శుభలేఖలు చూపుతాయనీ…
ఆ బొమ్మల పెళ్లిల్లే ఆ శీస్సులు తెలుపుతాయనీ…
తనకై నే నేర్చిన నడకలు ఏడడుగులుగా ఎదిగొస్తాయనీ తెలశాకా…
నువ్విక్కడుండి నేనక్కడుంటే  
నువ్విక్కడుండి నేనక్కడుంటే  ఎంతో కష్టం ||నువ్వు||

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

Nuvvu Nenu Kalisuntene Lyrics in Telugu – Gangotri

Like and Share
+1
0
+1
2
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Subscribe for latest updates

Loading