Menu Close

Nenera Ammanu Ayyedi Lyrics In Telugu – నేనేరా అమ్మను అయ్యేది

Nenera Ammanu Ayyedi Lyrics In Telugu – నేనేరా అమ్మను అయ్యేది

నేనేరా అమ్మను అయ్యేది… నేనేరా ఆలిని అయ్యేది
నేనేరా అమ్మను అయ్యేది.. నేనేరా ఆలిని అయ్యేది
నేనేరా నీ చిరునామను… నేనే కదా నీ అస్థిత్వమును
నేనే ప్రతిరూపం నీకు…
అలాంటి ఆడది మోసే గర్భంలో… ఒక ఆడపిల్ల ఉందని తెలిసి
నువు పిండాన్ని… చిదిమేస్తవు ఎందుకురా
మరి నేను నిన్ను కాదంటే… నీ మనుగడ ఏదిరా

నేనేరా అమ్మను అయ్యేది… నేనేరా ఆలిని అయ్యేది
నేనేరా అమ్మను అయ్యేది.. నేనేరా ఆలిని అయ్యేది

ఆడకూతురై పుట్టడం… మన్నించరాని నేరమా
మగవాడిలో సగమై ఎదిగిన… ఆ ఘనతను ఎందుకు మరిచిరో
అయ్యో కత్తుల దాడిని చేస్తుండ్రు… ఆ కడుపుల ముక్కలు చేస్తుండ్రు
పుడితే గొంతును నులిమేస్తూ… పసి ప్రాణం‌ నిలువున తీస్తుండ్రు
అలా ఆ చెత్త కుప్పలో… ఊపిరాడక విలవిల మంటే
కనికరించని లోకం లోకి… ఎందుకు వచ్చాను
ఆవేశంలోన చీకటి తప్పుకు… కడుపుల పడ్డాను

నేనేరా అమ్మను అయ్యేది… నేనేరా ఆలిని అయ్యేది
నేనేరా చెల్లిని అయ్యేది… నేనేరా చెలిమిని అయ్యేది

తొమ్మిది నెలలు మోసిన తల్లి… ఆడది అన్న సంగతి మరచి
మెట్టినింటికి కీడును చేసి… ఆడబిడ్డకు జన్మనిస్తినని
మగవాడిని కంటే గౌరవం… అది ఆడపిల్లైతె అగౌరవం
అని కసితో వీధిన విసిరేస్తే… ఏ కుక్కో పాలను తాపిస్తే..‌
అనాథగ పెరిగిన నాకు… నలుదిక్కుల్లో అవమానాలు ఎదురౌతే
ఈ పాపం నేనని… ఎవరిని అడగాలి
ఈ లోకం చూసే హేళన చూపుకు… బలి అయిపోవాలా

నేనేరా అమ్మను అయ్యేది… నేనేరా ఆలిని అయ్యేది
నేనేరా అమ్మను అయ్యేది.. నేనేరా ఆలిని అయ్యేది

నే అబలను కాదుర సబలను… విహరిస్తిని కదరా గగనము
పురాణాల్లో నా బలముకు… శ్రీ కృష్ణుడు బ్రతికిన చరితము
కాకతీయ సామ్రాజ్యము… అరె ఏలిన రాణిరుద్రను
ఆ‌ తెల్ల దొరలను తరిమిన… ఆ ఝాన్సీ భాయిని నేను
ఇలా ‌నా చరితను మరిచి… ఆడపిల్లంటే భయమును తలచి
మూర్ఖులు మీరై… ఒక్క క్షణంలో ఆలోచన చెయ్యరురా
పసి గొంతులో వరి గింజను ‌వేసి… పాపము చేయకురా

నేనేరా అమ్మను అయ్యేది… నేనేరా ఆలిని అయ్యేది
నేనేరా చెల్లిని అయ్యేది… నేనేరా చెలిమిని అయ్యేది

Nenera Ammanu Ayyedi Lyrics In Telugu – నేనేరా అమ్మను అయ్యేది

Share with your friends & family
Posted in Lyrics in Telugu - Movie Songs

Subscribe for latest updates

Loading