Unguram Lyrics In Telugu – OOrenaka Dunnichi – Mamidi Mounika, Dhurgavva
ఊరెనక దున్నిచ్చి
(ఊరెనక దున్నిచ్చి, ఊరెనక దున్నిచ్చి)
ఉల్లి నాటేసి… (ఉల్లి నాటేసి ఉల్లి నాటేసి)
ఊరెనక దున్నిచ్చి… ఉల్లి నాటేసి
ఉంగూరమే రంగైన రాంలాల, టుంగూరమే
(ఉంగూరమే రంగైన రాంలాల టుంగూరమే)
సెరువెనక దున్నించి సెరుకు నాటేసి
ఉంగూరమే రంగైన రాంలాల, టుంగూరమే
(ఉంగూరమే రంగైన రాంలాల టుంగూరమే)
సెరుకూకు సెయ్యెత్తి… మంచలే ఇచ్చి
మంచమీద సెల్లెళ్ళు కావళ్ళు గాసి
కావళ్ళతో కంటిపాపల్లు అలిసి
పాపళ్ళ సూపుల్లో పంటల్లు మెరిసి
ఉంగూరమే, అహా…
ఉంగూరమే రంగైన రాంలాల… టుంగూరమే
అగ్గో, ఉంగూరమే రంగైన రాంలాల… టుంగూరమే
ఎనిమిది వడిశాల పైనీది గుండు
ఉంగూరమే రంగైన రాంలాల… టుంగూరమే
(ఉంగూరమే రంగైన రాంలాల… టుంగూరమే)
సేను సుట్టూ తిరిగి పిట్టల్ల కొట్టి
ఉంగూరమే రంగైన రాంలాల… టుంగూరమే
(ఉంగూరమే రంగైన రాంలాల… టుంగూరమే)
ఆ సేను పక్క కాలువల్ల సేపల్లు బట్టి
పట్టీన సేపలన్ని పెదగూచికి గుచ్చి
తొవ్వొంటి పోయేటి తెనుగోళ్ళ తాత
ఇవ్వి మా అదినేకు ఇచ్చిరా గొంత
ఉంగూరమే, హొయ్ హొయ్…
ఉంగూరమే రంగైన రాంలాల… టుంగూరమే
అరే, ఉంగూరమే రంగైన రాంలాల… టుంగూరమే
ఇచ్చి వత్తా గాని ఇల్లు నేనేరుగా
ఉంగూరమే రంగైన రాంలాల… టుంగూరమే
(ఉంగూరమే రంగైన రాంలాల… టుంగూరమే)
పోయి వత్తా గాని పోలికలెరుగ
ఉంగూరమే రంగైన రాంలాల… టుంగూరమే
(ఉంగూరమే రంగైన రాంలాల… టుంగూరమే)
మూడు బజార్లు దాటి… మూల మలుపుల్ల
మలుపుల్ల మలిగినంక… మా ఊళ్ళ పాత నల్ల
నల్లాల బాయికాడ ఎడమా సేతుకెళ్లి
ఏడడుగులెత్తే మాది మట్టి పెంకలిల్లు
ఉంగూరమే, హొయ్ హొయ్…
ఉంగూరమే రంగైన రాంలాల… టుంగూరమే
ఓహో, ఉంగూరమే రంగైన రాంలాల… టుంగూరమే
తీసు పోసి పెరిగిన మీసాల కంకులిరిసి
ఉంగూరమే రంగైన రాంలాల… టుంగూరమే
(ఉంగూరమే రంగైన రాంలాల… టుంగూరమే)
కట్టెల్ల టాంపి పెట్టి కాల్సిందే కంకూల
ఉంగూరమే రంగైన రాంలాల… టుంగూరమే
(ఉంగూరమే రంగైన రాంలాల… టుంగూరమే)
సిట్ట సిట్ట సిన్నారి సేతుల్ల దీసి
కాలీన కంకులు ఆకుల్ల ఏసి
నీళ్ళ మిదులు మలిపేటి నీరాటి తాత
ఇవ్వి మా అన్నయ్యకిచ్చి రావయ్యా
ఉంగూరమే, హొయ్ హొయ్…
ఉంగూరమే రంగైన రాంలాల… టుంగూరమే
అరే, ఉంగూరమే రంగైన రాంలాల… టుంగూరమే
ఇచ్చి వత్తా గాని అన్ననేడా సూద్దు
ఉంగూరమే రంగైన రాంలాల… టుంగూరమే
(ఉంగూరమే రంగైన రాంలాల… టుంగూరమే)
ఎల్లి వత్తా గాని ఏడాని పోదు
ఉంగూరమే రంగైన రాంలాల… టుంగూరమే
(ఉంగూరమే రంగైన రాంలాల… టుంగూరమే)
మన ఊరి ఆవల ఊడుగుల పొదాలుండే
పొదలూ దాటినంకా పోషమ్మ గుడికాడ
కుడిసెయ్యి దిక్కు పోతే ఎంకన్న గుట్ట
గుట్టనడుగు మా యన్న మేకాల మేపుతండు
ఉంగూరమే, ఉంగూరమే రంగైన రాంలాల… టుంగూరమే
అరే, ఉంగూరమే రంగైన రాంలాల… టుంగూరమే
ఉంగూరమే రంగైన రాంలాల… టుంగూరమే
(ఉంగూరమే రంగైన రాంలాల… టుంగూరమే)