అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Vanajallu Gillutunte Lyrics in Telugu – Yamudiki Mogudu
వానజల్లు గిల్లుతుంటే ఎట్టాగమ్మా
నీటి ముల్లే గుచ్చుకుంటే ఎట్టాగమ్మా
సన్న తొడిమంటి నడుముందిలే
లయలే చూసి లాలించుకో
ఓ ఓ… వానజల్లు గిల్లుడింక తప్పదమ్మా
వంటి మొగ్గ విచ్చుకోక తప్పదమ్మా
చితచితలాడు ఈ చిందులో జతులాడాలి జతచేరుకో
ఓ ఓ… వానజల్లు గిల్లుతుంటే ఎట్టాగమ్మా
వానవిల్లు చీరచాటు వన్నెలేరుకో… వద్దు లేదు నా భాషలో
మబ్బుచాటు చందమామ సారె పెట్టుకో… హద్దు లేదు ఈ హాయిలో
కోడె ఊపిరే తాకితే… ఈడు ఆవిరే ఆరదా
కోక గాలులే హోయ్ సోకితే… కోరికన్నదే రేగదా
వడగట్టేసి బిడియాలనే… ఒడి చేరాను వాటేసుకో
మ్… వానజల్లు గిల్లుడింక తప్పదమ్మా
నీటి ముల్లే గుచ్చుకుంటే ఎట్టాగమ్మా
అందమంతా ఝల్లుమంటే అడ్డుతాకునా… చీరకట్టు తానాగునా
పాలుపుంత ఎల్లువైతే పొంగుదాగునా… జారుపైట తానాగునా
కొత్త కోణమే ఎక్కడో… పూల బాణమై తాకగా
చల్లగాలిలో సన్నగా… కూని రాగమే సాగగా
తొడగొట్టేసి జడివానకే… గొడుగేశాను తలదాచుకో
ఓఓ… వానజల్లు గిల్లుతుంటే ఎట్టాగమ్మా
నీటి ముల్లే గుచ్చుకుంటే ఎట్టాగమ్మా
చితచితలాడు ఈ చిందులో జతులాడాలి జతచేరుకో, ఓ ఓ