అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Telugu Health Tips, Health Tips in Telugu, Disadvantages of Eating Salt To Much.
మీరు ఈ మద్య కాలంలో ఉప్పు ఎక్కువ ఉన్న ఆహారం తీసుకుంటే మీకు ఉబ్బరంగా గా ఉంటుంది, అతి దాహం వేస్తుంది, డయేరియా, బరువు పెరగడం, వాంతులు ఉంటాయి. ఒక్కోసారి హార్ట్ దడగా కూడా ఉంటాయి.
ఉప్పు ఎక్కువుగా వాడడం వల్ల ఏం జరుగుతుంది.?
నెర్వ్ ఇంపల్సెస్ కండక్ట్ చేస్తున్నప్పుడు మజిల్స్‌ని రిలాక్స్ చేయడానికి ఉప్పులో ఉన్న సోడియం అనే మినరల్ హెల్ప్ చేస్తుంది. యూఎస్‌డీఏ వారి సూచన ప్రకారం పెద్దవారు రోజుకి 2,300 మిల్లీగ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి. అంటే, సుమారుగా ఒక టీ స్పూన్ ఉప్పు. అయితే, ఉప్పుని ఇంత కంటే తగ్గించడానికి లేదు. ఈ మాత్రం ఉప్పు చాలా అవసరం. బాడీలో జరిగే అనేకానేక పనులకి ఈ ఉప్పు కావాలి. అయితే, ఉప్పు ఎక్కువ తీసుకుంటే హైపర్ నెట్రీమియా అనే కండిషన్ రావచ్చు. ఈ కండిషన్ వల్ల బాడీలో డీహైడ్రేషన్ ఏర్పడవచ్చు.
ఒక్కోసారి బ్రెయిన్ సరిగ్గా పని చేయకపోవచ్చు కూడా. ఉప్పు ఎక్కువైతే మజిల్ ట్విచింగ్, కంఫ్యూజన్, కోమా, మూర్ఛ వంటివి జరగవచ్చు. ఒక్కోసారి ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు. అయితే, ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఉప్పు ఎక్కువ తీసుకోవడం అంటే మీరు వంటలో ఉప్పు ఎక్కువ వేస్తున్నారని అర్ధం చేసుకోకూడదు. ఉప్పు ఎక్కువగా వేస్తుంటే తగ్గించుకుంటాం, అది కాదు పాయింట్ ఇక్కడ. మీరు తినే శాండ్విచెస్, పీజా వంటి వాటిలో ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మనకి తెలియకుండానే చాలా ఉప్పు లోపలికి వెళ్ళిపోతుంది. అయితే, ఇలాంటివి తిన్నప్పుడు ఎక్కువయిన సోడియం ని బ్యాలెన్స్ చేసే ఫుడ్స్ కూడా ఉన్నాయి, వాటిని తీసుకుంటే సరిపోతుంది.
నివారణా మార్గాలు, సూచనలు:
అరటి పండు: అరటి పండులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఉప్పు ఎక్కువైన ఆహారం తీసుకున్న తరువాత బీపీ లెవెల్స్‌ని ఈ అరటి పండు కంట్రోల్ లో ఉంచుతుంది. బీపీ కంట్రోల్‌లో ఉంది అంటే అర్ధం స్ట్రోక్ వచ్చే రిస్క్ తగ్గిందని. అరటి పండులో ఫైబర్ కూడా ఎక్కువే, కాబట్టి హార్ట్ డిసీజ్ వచ్చే రిస్క్ కూడా తగ్గినట్లే.
పెరుగు: సోడియం ఎక్కువ తీసుకున్న రిస్క్‌ని తగ్గించే ఇంకో ఫుడ్ ఐటెం పెరుగు. ఇందులో కూడా పొటాషియం ఎక్కువే ఉంటుంది. పైగా ఇది గట్ హెల్త్ కి కూడా హెల్ప్ చేస్తుంది.
కివి పండు: ఉప్పు ఎక్కువగా ఉనా ఆహారం తీసుకున్నప్పుడు నోరంతా కూడా అదోలా అయిపోతుంది. అలాంటప్పుడు ఈ కివీ ఫ్రూట్ ఎంతో మేలు చేస్తుంది. రుచిని సరి చేస్తుంది. సోడియంని బ్యాలెన్స్ చేసే పొటాషియం ఇందులో కూడా ఉంది. ఇందులో ఉండే ఎంజైంస్ ప్రొటీన్ బ్రేక్ డౌన్ చేయడం లో హెల్ప్ చేస్తాయి. దాంతో అరుగుదల బాగుంటుంది, ఫలితంగా బ్లోటింగ్ కూడా తగ్గుతుంది.
అల్లం టీ: సోడియం లెవెల్స్‌ని బ్యాలెన్స్ చేయడం అల్లం టీ కూడా ఎక్సలెంట్ గా పని చేస్తుంది. ఈ టీ డైజెషన్ బాగుండేట్లు చేస్తుంది. స్వెల్లింగ్‌ని రెడ్యూస్ చేస్తుంది.
Conclusions
ఉప్పు అవసరమే, రుచికీ ఆరోగ్యానికీ కూడా. అయితే ఉప్పు ఎక్కువైతేనే ప్రాబ్లం. కాబట్టి మనకి తెలియకుండా ఉప్పు ఎక్కువ ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు ఆ హై సోడియం కంటెంట్ ని బ్యాలెన్స్ చేయడానికి పైన చెప్పిన ఫుడ్స్ తీసుకుంటే సరిపోతుంది.
గమనిక: ఈ సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల నుండి సేకరించ బడినది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు. వీటిని www.TeluguBucket.Com ధృవీకరించడం లేదు.
Telugu Health Tips, Health Tips in Telugu, Disadvantages of Eating Salt To Much.
మరిన్ని ఆరోగ్య పరమైన విషయాలు తెలుసుకోండి