O Premaa Naa Premaa Lyrics in Telugu – Chanti
ఓ ప్రేమా నా ప్రేమా
దైవాలాడే జూదం దయ్యంపాడే వేదం
ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా
దైవాలాడే జూదం దయ్యంపాడే వేదం
రక్తంలోని సుడిగుండం రాయైపోయే అనుబందం
ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా
క్షణమొక యుగముగా గడిపిన బ్రతుకిది తెలుసుకో ప్రియతమా
విరహమే సుఖమని కలయిక కలయని తలచుటే మధురమా
మృతులకు చితులకు ముగియని కధలివి కదలిరా ప్రణయమా
అడుగులు చిలికిన రుధిరవు మడుగుల ఎరుపులే ప్రళయమా
జారిపోయే కాలం చేజారిపోయే యోగం
రగులుతున్న గాయం నేనడగలేను న్యాయం
కరువౌతాను కన్నుల్లో గురుతుంటాను గుండెల్లో
ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా
దైవాలాడే జూదం దయ్యంపాడే వేదం
రక్తంలోని సుడిగుండం రాయైపోయే అనుబందం
ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా
గిరిలను విడిచిన నదులిక వెనుకకు తిరుగునా జగమున
కులమని కడుదని కులమని విలువలు చెరుగునా మనసున
గగనము మెరుపుల నగలను తొడిగితే ఘనతలే పెరుగునా
ఉరుములు వినపడి ఉదయపు వెలుగులు అదురునా చెదురునా
పేదవాళ్ళ ప్రేమ కాటువేసే పామా
స్వాగతాలు అనగా చావుకైనా ప్రేమ
మానై నేను బ్రతికున్నా మనిషై నేను చస్తున్నా
ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా
దైవాలాడే జూదం దయ్యంపాడే వేదం
రక్తంలోని సుడిగుండం రాయైపోయే అనుబందం
ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా