Menu Close

ఆడవాళ్ళతో పెట్టుకొద్దమ్మా – Funniest Telugu Jokes

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

మొగుడు పెళ్ళాల జోక్స్ – Telugu Jokes
స్టూడెంట్ టీచర్ జోక్

jokes laughing women

సుందరి భగవంతుడికోసం కఠోరమైన తపస్సు చేసింది.
ఎప్పుడూ మగవాళ్లే చేస్తారు…

అలాంటిది ఒక స్త్రీ తనకోసం తపస్సు చేయడం చూసి అబ్బురపడి…

భగవంతుడు వెంటనే ప్రత్యక్షమై…

“ఓ స్త్రీ… నేను నీ భక్తికి మెచ్చాను. నీకు ఒకటి కాదు 3 వరాలు ఇస్తాను. అంతే కాదు. నీకు ఏ వరమిస్తే… అది నీ భర్తకు 10 రెట్లు ఎక్కువయ్యే వరం కూడా ఇస్తాను అన్నాడు.

అందుకు…ఆమె సంతోషించి, “స్వామి… నాకు ఎవ్వరికీ లేనంత అందాన్నివ్వు” అనడిగింది.

దేవుడు, “తధాస్తూ… మరి నీ భర్తకు కూడా ఈ అందం పదిరెట్లు ఎక్కువవుతుంది” అని చెప్పి వరమిచ్చాడు.

సరేనంది ఆమె. ఆ తరువాత రెండో వరం కోరింది. ” 100 కోట్ల ధనాన్నివ్వు స్వామీ ” అంది.

దేవుడు మళ్ళీ సరేనన్నాడు. కాని, ఇచ్చేముందు “నీ భర్తకు ఈ ధనం 10 రెట్లు ఎక్కువవుతుంది. ఒక్కసారి ఆలోచించుకో… బాగా డబ్బు వచ్చాక…. నిన్ను పట్టించుకోడేమో” అన్నాడు.

“అదేం లేదు స్వామీ మీరు ఇవ్వండి” అందామె. దేవుడు మళ్ళీ తధాస్తు అన్నాడు. ఇంక మూడో కోరిక కోరమన్నాడు.

అందుకామె నెమ్మదిగా చెప్పింది… “స్వామీ…. ఈ రాత్రికి.. నాకు Mild Heart stroke (తేలికపాటి గుండెనొప్పి)ని ఇవ్వండి…” అంది.

దేవుడు……. కెవ్వుమన్నాడు………!
కధలో నీతి:- ఆడవాళ్ళతో పెట్టుకొద్దమ్మా!

మొగుడు పెళ్ళాల జోక్స్
స్టూడెంట్ టీచర్ జోక్
స్

Like and Share
+1
0
+1
2
+1
0

Subscribe for latest updates

Loading