Menu Close

Rama Rama Rama Lyrics in Telugu – Sri Rama Rajyam


Rama Rama Rama Lyrics in Telugu – Sri Rama Rajyam

రామ రామ
రామ రామ
రామ రామ రామ
మరమ రామ రామ
మరమ రామ రామ రామ రామ రామ రామ అనే రాజమందిరం
ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం

రామ రామ రామ అనే రాజమందిరం
ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం
రాజమందిరం బాల రామ సుందరం
ముద్దు ముద్దు మాటలంటే ముద్దుగారి పోతాడంట
ఆపలేని అల్లరంతా తెప్ప తెప్ప తీయనంత
బలరాముని అల్లరి అంటే వశిష్టునికి ఇష్టమంటే
రామ రామ
మరమ రామ
మరమ రామ రామ అనే రాజమందిరం
ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం

బాణముతో గోడ మీద కోతి బొమ్మ గీస్తాడంట
వజ్రపుటుంగరం తీసి కాకి పైకి విసిరినంట
సిలికా ఎంగిలి జాం పండే కోరి మరి తింటాడంట
ఖర్జురాలు ద్రాక్షలు ఉడతలకే పెడతాడంట
దాక్కుంటాడంట చెట్టు సాటుకెళ్ళి
రాళ్ళేస్తాడంట సెరువులోన మల్లి
అమ్మ నాన్న అంట ఆ అల్లరి మెచ్చుకొని
బాల రాముని భలే అని ముద్దులు పెట్టారంట
రామ రామ
మరమ రామ
మరమ రామ రామ అనే రాజమందిరం
ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం

పాల బువ్వ తినమంటే మీద పైకి పరుగులంటా
పసిడి బిందెలోని పన్నీరు ఒలకబోస్తాడంట
చందమామ కావాలని సందె కదా గొడవంట
అద్దములో చూపిస్తే సంచిలోన దాసీనంట
శ్రీ రాముడయినా చినప్పుడూ ఇంతె
ఆకాశమంటే అల్లరి చేసాడంట
అమ్మ నాన్న అన్ని మాకు నువ్వే కదా అమ్మ
ఎప్పుడు ఇంకా హద్దులు మీరం
తప్పుని మన్నించమ్మ

రామ రామ రామ అనే రాజమందిరం
ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం
రాజమందిరం బాల రామ సుందరం
ముద్దు ముద్దు మాటలంటే ముద్దుగారి పోతాడంట
ఆపలేని అల్లరంతా తెప్ప తెప్ప తీయనంట
బలరాముని అల్లరి అంటే వశిష్టునికి ఇష్టమంటే
రామ రామ
మరమ రామ
మరమ రామ రామ అనే రాజమందిరం
ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం

Share with your friends & family
Posted in Lyrics in Telugu - Movie Songs

Subscribe for latest updates

Loading