ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Inspiring Stories in Telugu
ఈ సందర్భంలో నాకొక కథ గుర్తుకొస్తోంది. రాక్ ఫెల్లర్ అనే పెద్ద మనిషికి భార్య అంటే పడదు. వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తన తదనంతరం తన భార్య ఎందుకు సుఖపడాలని జీవిత బీమా చేయడానికి ఇష్టపడేవాడు కాదు. జీవిత బీమా ఏజెంట్లకు ఎవ్వరికీ అప్పాయింట్ మెంట్ ఇవ్వొద్దని తన సెక్రటరీకి చెప్పాడు. ఒక రోజు ఒక బీమా ఏజెంట్ సెక్రటరీ పర్మిషన్ తీసుకుని రాక్ ఫెల్లర్ కు జీవిత బీమా గొప్పదనం, ఉపయోగం గురించి 5ని. అద్భుతంగా చెప్పాడు.
దానికి రాక్ ఫెల్లర్ ఆనందించి, “నీవు చాలా అదృష్టవంతుడివి. ఈ రోజు నా భార్య పొద్దున్నే ఆశ్చర్యంగా కాఫీ చేతికి అందించింది. అనుకోకుండా మా సెక్రటరీ రాకపోవడంతో ఆ చోట్లో ఉన్న ఈ కొత్త సెక్రటరీకి ఇన్సూరెన్స్ ఏజెంట్లను లోపలికి పంపకూడదని తెలీదు.” అంటూ బిలియన్ డాలర్లకు చెక్కు రాసి ఇస్తూ, “ఇంతవరకూ 162 మంది ఏజెంట్లను బయటినుండి బయటికి పంపేసాను.” “సార్! ఆ162 సార్లు వచ్చింది నేనే” అంటూ చెక్ జేబులో పెట్టుకొని వెళ్లి పోయాడు.
జీవితంలో గెలవాలన్నా, డబ్బు బాగా సంపాదించాలన్నా ఓపిక, ఓర్పు, సహనం కావాలి. మీకు నచ్చే విధంగా ఈ పోస్టులు పెట్టాలంటే ఎన్నో విషయాలు చదవాలి, నేర్చుకోవాలి, దాని భావం, బిగి సడలకుండా, భాషాలోపాలు లేకుండా ఈ కార్డు సైజుకు కుదించాలి. రంగులద్దాలి. నాలాంటి వ్యక్తికి నాలుగైదు గంటలు పడుతుంది. మీలాంటి యువత తలుచుకుంటే ఓర్పుతో చాలా గొప్ప పనులు చేయవచ్చు.
సేకరణ – V V S Prasad