అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Funny Stories in Telugu
దాదాపు 50 సంవత్సరాలుగా ఆనందంగా ఉన్న జంట, కష్ట సుఖాలను ఒకరితో ఒకరు పంచుకొంటూ జీవిస్తున్నారు. వాళ్ళ మధ్య రహస్యాలు ఎమీ లేవు, ఒకే ఒకటి, ఒక డబ్బాకు సంబంధించినది తప్ప. ఆ డబ్బాను ఎట్టిపరిస్థితుల్లోనూ తీసి చూడకూడదని భార్య భర్త దగ్గర ప్రమాణం తీసుకుంది. చాలా ఏళ్ళు దాని గురించి ఎవరూ మాట్లాడలేదు.
కానీ భర్తకు మాత్రం ‘అందులో ఏముంద’నే ఉత్సుకత తొలిచి వేస్తుండేది. ఒకరోజు ఆ వృద్ధురాలు జబ్బున పడింది, కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఆమె ఆ రహస్యాన్ని ఇంక దాచవలసిన అవసరం లేదని, భర్తను ఆ డబ్బాను తీసుకొని రమ్మని చెప్పింది. భర్తను దాన్ని తెరవమని అడిగింది.
ఆ డబ్బాలో రెండు ఊలుతో అల్లిన బొమ్మలు, దాదాపు ఏడు లక్షల రూపాయలు కనిపించాయి. ‘ఆ డబ్బు ఏమిట’ని మరణశయ్య మీద ఉన్న భార్యను అడిగాడు. “మనం పెళ్లి చేసుకున్నప్పుడు మా అమ్మమ్మ వివాహవ్యవస్థ ఆనందంగా గడవాలంటే ఎప్పుడూ వాదించ కూడదనీ, కోపం వస్తే నిశ్శబ్దంగా ఒక పక్కన కూర్చొని ఊలుతో బొమ్మలు అల్లుకోమని చెప్పింది.
“నేను అలాగే చేశాను. ఆ డబ్బాలో రెండే రెండు పూలు బొమ్మలు ఉన్నాయి,అంటే భార్యకు రెండుసార్లే కోపం వచ్చిందని పెద్దాయన చాలా ఆనందపడ్డాడు. “డియర్ రెండు బొమ్మలు సంగతి అర్థమైంది. ఆ డబ్బు మాటేమిటి?? అది ఎక్కడి నుంచి వచ్చింది” ఆమె నవ్వుతూ చెప్పింది, “ఆ డబ్బు నేను ఊలు బొమ్మలు
అమ్మ గా వచ్చింది” అని.
సేకరణ – V V S Prasad