ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
విజయవంతమైన వైవాహిక జీవితం – Telugu Funny Stories
స్నేహితులతో హోటల్ లో కూర్చుని కాఫీ తాగుతున్నాడు భీర్ కుమార్. “నీవు, నీ భార్యా పిల్లలతో ఇంత సంతోషమైన జీవితం గడుపుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నీవు ఆమె ఏదైనా రెండోసారి అడగడానికి అవకాశం ఇవ్వవు. ఇదే నీ గొప్ప వైవాహిక జీవిత రహస్యం అనుకుంటా!” అన్నాడొకడ.
భీర్ కుమార్ “చిన్నగా దీన్ని మీకు వివరిస్తాను. మా పెళ్లి తర్వాత ఆమె,ఆమె గుర్రం మీద; నేను నా గుర్రం మీద విహారానికి వెళ్తున్నాం. నా గుర్రం కాళ్ళు బురదలో ఇరుక్కున్నాయి. అప్పుడు నా భార్య తన గుర్రం మీద నుంచి దిగి నా గుర్రం దగ్గరికి వచ్చి, “ఒకటో సారి” అనింది. గుర్రం కొద్దిసేపటికి కదిలింది. కొంత దూరం పోగానే మళ్ళీ నా గుర్రం కాళ్ళు బురదలో చిక్కుకున్నాయి.
మా విహార యాత్ర ఆగింది. మా ఆవిడ మళ్ళీ నా గుర్రం దగ్గరికి వచ్చి దానితో “రెండోసారి” అనింది. గుర్రం కదిలింది. మళ్లీ కొంత దూరం పోగానే, నా గుర్రం కాళ్ళు బురదలో చిక్కుకుని మా గుర్రపు స్వారీ ఆగింది. గుర్రం దిగి నా శ్రీమతి నా గుర్రం దగ్గరికి మళ్ళీ వచ్చి “మూడోసారి” అని, తుపాకీ తీసి గుర్రం మొహం మీద గురిపెట్టి కాల్చేసింది.
నేను బిత్తరపోయి, ఆమె మీద కేకలు వేశాను. “నీకేమైనా పిచ్చా ! ఎందుకు దాన్ని అలా కాల్చి చంపేసావు ??!” నా శ్రీమతి వెనక్కి తిరిగి నన్ను చూసి “ఒకటో సారి” అనింది. అంతే! మా ఆవిడకి “రెండో సారి” అని చెప్పే అవకాశం ఇవ్వలేదు.
సేకరణ – V V S Prasad
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి.
Telugu Stories, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories, Best Stories in Telugu, Intelligent Telugu Stories, Telugu Kadhalu, Telugu Stories PDF, Telugu Stories Books, నీతి కథలు, ప్రేమ కథలు, తెలుగు కథలు, తెలుగు స్టోరీస్, పిల్లల కథలు