ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
మోసం చేస్తే ఏదొక రోజు దొరికిపోతావ్ – Telugu Short Stories
మంచి యవ్వనంలో ఉన్న ఎలుక ఒకటి సాహసాలు చెయ్యాలనుకొని చెరువు గట్టు మీద ఉత్సాహంగా తిరగనారంభించింది. అక్కడ ఒక జిత్తులమారి కప్ప కూడా నివసిస్తోంది. కప్ప ఎలుకను చూసి దాని దగ్గరకు ఈదుకుంటూ వచ్చి, “మా ఇంటికి ఆతిథ్యానికి రావా?? నీకొక మరిచి పోలేని అందమైన అనుభూతిని ఇస్తాను.”
సాహసం చెయ్యాలని వచ్చిన ఎలుకకు ఎక్కువ బ్రతిమాలించుకొనే అవసరం ఏర్పడలేదు. ఎందుకంటే దానికి ప్రపంచాన్ని చూడాలని ఆతృతగా ఉంది కూడా! ఎలుక కొద్దిగా ఈదగలదు కానీ, ఏ అండా లేకుండా దిగడానికి ధైర్యం చాలలేదు. కుత్సితమైన కప్పకు ఒక ఉపాయం తట్టింది.
ఒక తాడు తీసుకుని ఎలుక కాలికి ఒక వైపు, రెండో చివర తన కాలికి కట్టుకొని నీళ్ళల్లోకి దూకింది, దాని వెనక మూర్ఖపు ఎలుక కూడా నీళ్ళల్లో పడిపోయింది. ఎలుక నీళ్ళల్లో ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటూ ఒడ్డుకు పోదామనుకుంది, కానీ కప్ప దుర్మార్గంగా దాన్ని నీళ్ళ అడుక్కు లాక్కుపోయింది.
ఊపిరాడక ఎలుక చచ్చిపోయి నీళ్ళపైన తేలుతోంది. ఈ లోపల కాలికి కట్టుకొన్న తాడును విప్పుకోవాలని కప్ప విశ్వ ప్రయత్నం చేసింది. ఆకాశంలో ఎగురుతున్న గద్దకు చచ్చి తేలుతున్న ఎలుక కనిపించింది. ఒక్కసారిగా క్రిందికి ఎగురుతూ వచ్చి ఎలుకను నోట కరుచుకుని పోయింది. ఎలుకతో పాటు కప్ప కూడా
బోనస్ గా దొరికింది.
మోసపూరితంగా హాని చెయ్యాలని చూస్తే, వాళ్ళు కూడా చిక్కుల్లో చిక్కుకుంటారు.
సేకరణ – V V S Prasad