ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
భయం భయంకరమైనది – Telugu Short Stories
చాలా ఏళ్ళ క్రితం ఒక రాజుగారికి కలలో ఒక మహమ్మారి అంటువ్యాధి వచ్చి, “నీ రాజ్యంలోని ఒక 500 మంది జనాన్ని త్వరలో పొట్టన బెట్టుకోపోతున్నాను” అని బెదిరించింది. ఉదయాన్నే రాజు మంత్రులను పిలిచి రాజ్యమంతా అంటువ్యాధి గురించి దండోరా వేసి విస్తృతంగా ప్రచారం చేయించాడు.
అయితే ఈ ప్రచారం మంచి చేయకపోగా, ప్రజల్లో భయాన్ని, ఆందోళననీ కలగజేసింది. మహమ్మారి రానే వచ్చింది. జనం పిట్టల్లా రాలిపోయారు. అంటువ్యాధి తన పని ముగించుకొని పోతూపోతూ, రాజుగారి కలలోకి వచ్చింది. రాజు కోపంతో, “నీవు 500 మందిని చంపుతానని, 5,500 మందిని ఎందుకు బలి తీసుకున్నావ్.?”
నిజానికి నేను 500 మందిని కబళించడానికే వచ్చాను. కానీ మీరు చేసిన ప్రచారం వల్ల భయాందోళనలతో మరో 5000 మంది చనిపోయారు అంటూ మాయమైంది.
సేకరణ – V V S Prasad