అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Sipaayi O Sipaayi Lyrics In Telugu – Akbar Salim Anarkali
సిపాయీ సిపాయీ… సిపాయీ సిపాయీ
నీకై ఎంత ఎంత… వేచి వేచి ఉన్నానో
ఈ వాలుకనులనడుగు అడుగు చెపుతాయీ, ఈఈ ఈ
సిపాయీ ఓ..సిపాయీ
హసీనా… హసీనా
నీకై ఎంత ఎంత… వేగి వేగి పోయానో
ఈ పూలమనసునడుగు అడుగు ఇకనైనా, ఆ ఆఆ
హసీనా, ఓ ఓ… హసీనా
జడలోని మల్లెలు జారితే… నీ ఒడిలో ఉన్నాననుకున్నా
చిరుగాలిలో కురులూగితే… చిరుగాలిలో కురులూగితే
నీ చేయి సోకెనని అనుకున్నా
ఆ మల్లెలలో కదలాడినవి… నా కలవరింపులే, ఏఏ
ఆ గాలిలో చెలరేగినవి… ఆ గాలిలో చెలరేగినవి
నా నిట్టూరుపులే, ఏఏ
హసీనా, ఓ ఓ… హసీనా
నీకై ఎంత ఎంత… వేచి వేచి ఉన్నానో
ఈ వాలుకనులనడుగు అడుగు చెపుతాయీ, ఈఈ ఈ
సిపాయీ ఓ..సిపాయీ
తడి ఇసుకను గీసిన గీతలు… అల తాకితే మాసి పోతాయి
ఎదలోన వ్రాసిన లేఖలు… ఎదలోన వ్రాసిన లేఖలు
బ్రతుకంతా ఉండి పోతాయి
ఆ లేఖలలో ఉదయించినవి… నా భాగ్యరేఖలే, ఏఏ
మన ఊపిరిలో పులకించినవి… మన ఊపిరిలో పులకించినవి
వలపు వాకలే, ఏ ఏ
సిపాయీ ఓ ఓ..సిపాయీ
నీకై ఎంత ఎంత… వేగి వేగి పోయానో
ఈ పూలమనసునడుగు అడుగు ఇకనైనా, ఆ ఆఆ
హసీనా, ఓ ఓ… హసీనా
సిపాయీ ఓ ఓ..సిపాయీ
హసీనా, ఓ ఓ… హసీనా