ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Nee Illu Bangaram Kanu Lyrics In Telugu – Gaja Donga
లాలలా లాలలా గోల్డ్ మాన్ గోల్డ్ మాన్)
నీ ఇల్లు బంగారం గాను… నా ఒళ్ళు సింగారం గాను
జోరుమీద ఉన్నావు జోడు కడతావా
మోజుమీద సన్నజాజి పూలు పెడతావా, హా హా హా
నీ ఇల్లు బంగారంగాను… నా ఒళ్ళు సింగారంగాను
పొంగుమీద ఉన్నావు తోడు పెడతావా
మురిపాల మీగడంత తోడి పెడతావా, హా హా హా
నీ ఇల్లు బంగారంగాను… నా ఒళ్ళు సింగారంగాను
(ఓహో గోల్డ్ మాన్… ఓహో గోల్డ్ మాన్)
బంగారు కొండమీద శృంగార కోటలోన
చిలకుంది తెమ్మంటావా… చిలకుంది తెమ్మంటావా
రతనాల రాతిరేలా పగడాల పక్క చూసి పలికింది రమ్మంటావా
ఏడేడు వారాల నగలిస్తే రమ్మంటా
హారాలకే అగ్రహారాలు రాసిస్తా
అందాల గని ఉంది నువ్వు చూసుకో
నీకందాక పని ఉంటే నన్ను చూసుకో
నీ ఇల్లు బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను
వజ్రాల వాడలోన… వైఢూర్యమంటి నన్నూ
వాటేయ వద్దంటావా… వాటేయ వద్దంటావా
ముత్యాల మేడలోనా మాణిక్యమంటి నన్ను, ముద్దాడ వస్తుంటావా
వరహాల పందిట్లో విరహాలు నీకేలా
రతనాల ముంగిట్లో రాగాలు తీయాల
మేలైన సరుకుంది మేలమాడుకో
ఓ గీటురాయి మీద దాన్ని గీసి చూసుకో
నీ ఇల్లు బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను
జోరుమీద ఉన్నావు జోడు కడతావా
మురిపాల మీగడంతా తోడిపెడతావా, హా హా హా