Menu Close

Ee Duryodhana Dussasana Lyrics In Telugu – Pratighatana


Ee Duryodhana Dussasana Lyrics In Telugu – Pratighatana

ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో
రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో
మరో మహాభారతం… ఆరవ వేదం
మానభంగ పర్వంలో… మాతృహృదయ నిర్వేదం, నిర్వేదం

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

పుడుతూనే పాలకేడ్చి… పుట్టీ జంపాలకేడ్చి
పెరిగి పెద్ద కాగానే… ముద్దూమురిపాలకేడ్చి
తనువంతా దోచుకున్న… తనయులు మీరు

మగసిరితో బ్రతకలేక కీచకులై… కుటిల కామ మేచకులై
స్త్రీ జాతిని అవమానిస్తే
మీ అమ్మల స్తన్యంతో… మీ అక్కల రక్తంతో
రంగరించి రాస్తున్నా ఈనాడే మీకోసం
మరో మహాభారతం… ఆరవ వేదం
మానభంగ పర్వంలో… మాతృహృదయ నిర్వేదం, నిర్వేదం

కన్న మహా పాపానికి… ఆడది తల్లిగ మారి
మీ కండలు పెంచినదీ గుండెలతో కాదా
ఎర్రని తన రక్తాన్నే… తెల్లని నెత్తురు చేసి
పెంచుకున్న తల్లీ… ఒక ఆడదని మరిచారా
కనపడలేదా అక్కడ పాపలుగా మీ చరిత్ర
ఏనాడో మీరుంచిన లేత పెదవిముద్ర
ప్రతి భారతి సతి మానం… చంద్రమతి మాంగల్యం
మర్మస్థానం కాదది… మీ జన్మస్థానం
మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం

శిశువులుగా మీరుపుట్టి… పశువులుగా మారితే
మానవరూపంలోనే… దానవులై పెరిగితే
సభ్యతకీ సంస్కృతికీ… సమాధులే కడితే 
కన్నులుండి చూడలేని ధృతరాష్ట్రుల పాలనలో
భర్తలుండి విధవ అయిన ద్రౌపది ఆక్రందనలో
నవశక్తులు యువశక్తులు… నిర్వీర్యం అవుతుంటే

ఏమైపోతుందీ సభ్యసమాజం… ఏమైపోతుందీ మానవధర్మం
ఏమైపోతుందీ ఈ భారతదేశం… మన భారతదేశం
మన భారతదేశం… మన భారతదేశం

Like and Share
+1
0
+1
4
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading