Menu Close

Priya Priya Champodde Lyrics In Telugu – Jeans

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Priya Priya Champodde Lyrics In Telugu – Jeans

ఆహా హా… ఆఆ ఆ… ఆఆ ఆ
ఆహా హా… ఆఆ ఆ… ఆఆ ఆ
ప్రియా ప్రియా చంపోద్దే… నవ్వీ నన్నే ముంచోద్దే
చెలీ కన్నులతో హృదయం కాల్చోద్దే
అయ్యో వన్నెలతో… ప్రాణం తీయోద్దే
ప్రియా ప్రియా చంపోద్దే… నవ్వీ నన్నే ముంచోద్దే

చెలియా నీదు నడుమును చూశా… అరెరే బ్రహ్మెంత పిసినారి
తలపైకెత్తా కళ్ళు తిరిగిపోయే… ఆహా అతడే చమత్కారి
మెరుపును తెచ్చి కుంచగ మలచి… రవివర్మ గీసిన వదనమట
నూరడుగుల శిల ఆరడుగులుగా… శిల్పులు చెక్కిన రూపమట
భువిలో పుట్టిన స్త్రీలందరిలో… నీదే నీదే అందమటా
అంతటి అందం అంతా ఒకటై… నన్నే చంపుట ఘోరమటా
ప్రియా ప్రియా చంపోద్దే… నవ్వీ నన్నే ముంచోద్దే

అందమైన పువ్వా పువ్వా… చెలి కురుల సురభి తెలిపేవా
అందమైన నదివే నదివై… చెలి మేని సొగసు తెలిపేవా
అందమైన గొలుసా గొలుసా… కాలి సొగసు తెలిపేవా
అందమైన మణివే మణివే… గుండె గుబులు తెలిపేవా
ఆఆ…ఆఆఅ…………

చంద్రగోళంలో ఆక్సిజన్ నింపి… అక్కడ నీకొక ఇల్లుకడతా
నీ ప్రాణాలను కాపాడేందుకు… నా ప్రాణాలను బదులిస్తా
ఆహా హా… ఆఆ ఆ… ఆఆ అ
మబ్బులు తెచ్చి పరుపుగ పేర్చి… కోమలాంగి నిను జో కొడతా
నిద్దురలోన చెమటలు పడితే… నక్షత్రాలతో తుడిచేస్తా
పంచవన్నె చిలక జలకాలాడగ… మంచు బిందువులె సేకరిస్తా
దేవత జలకాలాడిన జలమును.. గంగా జలముగ సేవిస్తా

ప్రియా ప్రియా చంపోద్దే
ప్రియా ప్రియా చంపోద్దే… నవ్వీ నన్నే ముంచోద్దే
చెలీ కన్నులతో హృదయం కాల్చోద్దే
అయ్యో వన్నెలతో… ప్రాణం తీయోద్దే
ప్రియా ప్రియా చంపోద్దే… నవ్వీ నన్నే ముంచోద్దే
ఆహా హా… ఆఆ ఆ… ఆఆ అ
ఆహా హా… ఆఆ ఆ… ఆఆ అ

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading