Menu Close

Sankranthi Vachinde Tummeda Song Lyrics In Telugu – Soggadi Pellam

అలికి పెట్టిన ముగ్గు… తళతళ మెరిసింది
తుమ్మెద ఓ తుమ్మెద…
మురిపాల సంక్రాంతి… ముంగిట్లోకొచ్చింది
తుమ్మెద ఓ తుమ్మెద…
గొబ్బియ్యళ్లో గొబ్బియ్యళ్లో… చలిమంట వెలుగుల్లూ
తుమ్మెద ఓ తుమ్మెద…

సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా… సరదాలు తెచ్చిందే తుమ్మెదా
కొత్త ధాన్యాలతో… కోడి పంద్యాలతో, ఊరే ఉప్పొంగుతుంటే
ఇంటింటా… ఆ ఆఆ… పేరంటం
ఊరంతా… ఆ ఆఆ… ఉల్లాసం
కొత్త అల్లుళ్ళతో, కొంటె మరదళ్లతో… పొంగే హేమంత సిరులు

గొబ్బియ్యళ్లో గొబ్బియ్యళ్లో గొబ్బియ్యళ్లో
గొబ్బియ్యళ్లో గొబ్బియ్యళ్లో గొబ్బియ్యళ్లో

మంచి మర్యాదని, పాప పుణ్యాలని… నమ్మే మన పల్లెటూళ్ళు
న్యాయం మా శ్వాసని… ధర్మం మా బాటని, చెబుతాయి స్వాగతాలు
బీద గొప్పోళ్లనే మాటలేదు… నీతి నిజాయితీ మాసిపోదు
మచ్చలేని మనసు మాది… మంచి పెంచు మమత మాది
ప్రతి ఇల్లో బొమ్మరిల్లు…

సంక్రాంతి వచ్చిందే… తుమ్మెదా
సరదాలు తెచ్చిందే తుమ్మెదా… ఓఓ ఓయ్

పాటే పంచామృతం… మనసే బృందావనం
తడిపేనే ఒళ్లు ఝల్లు…
మాటే మకరందము… చూపే సిరి గంధము
చిరునవ్వే స్వాతి జల్లు…
జంట తాళాలతో… మేజువాణి
జోడు మద్దెళ్ళనీ… మోగిపోనీ
చెంతకొస్తే పండగాయే… చెప్పలేని బంధమాయే
వయసే అల్లాడిపోయే…

సంక్రాంతి వచ్చిందే… తుమ్మెదా
హొయ్… సరదాలు తెచ్చిందే… తుమ్మెదా
హోయ్… కొత్త ధాన్యాలతో, కోడి పందాలతో… ఊరే ఉప్పొంగుతుంటే
ఇంటింటా… ఆ ఆఆ… పేరంటం
ఓయ్ ఓయ్ ఓయ్ ఊరంతా… ఆ ఆఆ… ఉల్లాసం
కొత్త అల్లుళ్ళతో, కొంటె మరదళ్లతో… పొంగే హేమంత సిరులు

Like and Share
+1
2
+1
3
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading