ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
మారిన మన జీవనశైలి, ఉరుకు పరుకుల జీవితం,ఒత్తిడి,సరిగ్గా నిద్ర పట్టకపోవడం వంటి కారణాలతో సమయానికి ఆహారం తీసుకోకపోవటం వలన గ్యాస్ సమస్య-Gastric Problem వస్తుంది.
ఈ సమస్యను తగ్గించుకోవటానికి కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
అల్లం:
అల్లం గ్యాస్ సమస్యను నివారించటమే కాకుండా జీర్ణక్రియ సక్రమంగా జరగటానికి సహాయపడుతుంది. అల్లంను టీ రూపంలో తీసుకోవచ్చు. లేదా అల్లం రసంగా చేసుకొని కూడా తీసుకోవచ్చు.
దాల్చినచెక్క:
దాల్చిన చెక్కతో యాంటిఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండుట వలన కొవ్వును విచ్ఛిన్నం చేసి జీర్ణక్రియలో సహాయపడుట వలన గ్యాస్ సమస్య తగ్గుతుంది. దాల్చిన చెక్క పొడిని కాఫీ లేదా సలాడ్స్ లో జల్లుకుంటే సరిపోతుంది.
అనాస:
అనాస లో బ్రొమైలిన్ అనే ఎంజైమ్ ఉండుట వలన కొవ్వును విచ్ఛిన్నం చేసి జీర్ణక్రియలో సహాయపడుట వలన గ్యాస్ సమస్య తగ్గుతుంది.
మంచి నీరు:
మంచి నీటిని ఎక్కువగా త్రాగటం వలన శరీరంలో మలినాలను బయటకు పంపటంలో సహాయపడుతుంది. అంతేకాక ఆహారాన్ని త్వరగా విచ్ఛిన్నం చేయటం వలన గ్యాస్ సమస్య తగ్గుతుంది. అందువలన మంచి నీటిని ఎక్కువగా త్రాగటం అలవాటు చేసుకోవాలి.
నట్స్:
నట్స్ లో నియాసిన్ సమృద్ధిగా ఉండుట వలన జీర్ణవ్యవస్థను యాక్టివ్ ఉంచుతుంది. దాంతో గ్యాస్ సమస్య తగ్గుతుంది.
నిమ్మరసం:
నిమ్మరసంలో ఆమ్ల గుణం ఉండుట వలన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అందువలన ప్రతి రోజు పరగడుపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని త్రాగితే మంచిది.