Menu Close

స్త్రీ చెయ్యకూడని పనులు చెయ్యటం ప్రారంభిస్తే వాటిని ఆపటం ఎవ్వరి తరమూ కాదు – తెలుగు సూక్తులు


స్త్రీ చెయ్యకూడని పనులు చెయ్యటం ప్రారంభిస్తే వాటిని ఆపటం ఎవ్వరి తరమూ కాదు.
రక్షించుకోలేని వాడికి భార్య అనవసరం. దున్నటం చేతకాని వాడికి పొలం అనవసరం.
స్త్రీకి లొంగిపోయిన పురుషుడు నదీ ప్రవాహంలో పడిన చెట్టు వలే సుఖంగా జీవనం సాగిస్తాడు.
ఆడవారితో అవసరమైన పని ఉన్నా ఇంటికెళ్ళి కలవకూడదు.

కాముకునికి తన భార్య సుందరి అయినా, వేప చెట్టులా అగుపిస్తుంది.
పక్కంటి వాడి భార్య అనాకారి అయినా రంభలా అగుపిస్తుంది.

స్త్రీ మగవాడి చూపును బట్టే తనలో అతనేం ఆశిస్తున్నాడో తెలుసుకోగలదు.
భర్త గొప్పదనమంతా భార్య వంటి మీద నగలూ, చీరలే చెబుతాయి.
పదిలక్షలు పెట్టి భార్యకి బంగారం కొని పెట్టినా, ఆటోకిచ్చిన తన పదిని భర్తనడిగి మరీ తీసుకుంటుంది.
స్త్రీ తప్పు చేసిందంటే రెండే కారణాలు ఒకటి భర్త చేతకాని తనము, రెండు అవసరము ఏ స్త్రీ కూడా
ఒళ్ళు కొవ్వెక్కి తప్పు చేయదు.

ప్రేమతో స్త్రీ శృంగారాన్ని అందిస్తే పురుషుడు ఆ స్త్రీ చుట్టూ తిరుగుతాడు.
తండ్రి మొగుడికన్నా ధనవంతుడైతే ఆ స్త్రీకి – భర్త మీద ఒకింత పెత్తనము ఉంటుంది.
గృహం అంటే భార్య. అంతే గాని గోడలూ, భోజనశాలా, శయనమందిరము కాదు.

భార్యతో ఏకాంత సమయాన ఏ వాగ్దానం చేసినా అది ఆపై చెయ్యకపోవటం దోషం కాదు.
స్త్రీకి పురుషుడే జీవితం. పురుషునికి జీవితంలో స్త్రీ ఓ భాగం మాత్రమే.
తల్లి గొప్పదా, భార్య గొప్పదా అంటే ఇద్దరూ గొప్పవారే. కాకపోతే ఒకింత భార్యే గొప్పది.

స్త్రీ శృంగారానికి పనికిరాకపోతే ఒక్క స్త్రీ కూడా ఈ భూమ్మీద బ్రతికుండదు.
స్త్రీ ఇంట్లో కొట్టినా భరిస్తుంది. నలుగురిలో తిడితే ఆడ పులిలా విరుచుకుపడుతుంది.

భర్త భార్యని భద్రంగా, రక్షణగా మాత్రమే చూసుకుంటాడు.
కానీ భార్య భర్త గౌరవాన్నీ, సంతానాన్నీ, ధనాన్ని కాపాడుతుంది.
సేవకురాలిగా, తల్లిగా, స్నేహితురాలిగా, మంత్రిగా వీటన్నింటికి మించి
ప్రేమగా, భక్తిగా చూసుకుంటుంది.

Share with your friends & family
Posted in Telugu Quotes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading