ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
మ్ మ్ ఆ ఆ ఆఆ ఏకువలో మాయ సీకటిలో మాయ
సూపులలో మాయ ఊసులలో మాయ, ఏయ్
ఏకువలో మాయ… సీకటిలో మాయ
సూపులలో మాయ ఊసులలో మాయ
మాయ మాయ వీర… సాహో ధీర శూర
నింగినేల పూరా స్వాహా చేసావేరా
మాయ మాయ వీర… సాహో ధీర శూర
నింగినేల పూరా స్వాహా చేసావేరా
ఏ, అడ్డడ్డే కొత్తవతారం ఎత్తేసారే మీరు
అసలేరి కించిత్తైనా శంకించేటివారు
యే, చిత్రాల జంతరు మంతరు
పెట్టెను తెచ్చేసారు
జతకట్టి చిత్రాలెన్నో చూపించేస్తున్నారు
ఉన్నారచ్చం మీరిద్దరొక హచ్చు హల్లుల్లా
అరె చెప్పండయ్యా ఈ హెచ్చులిక తగ్గించేదెల్లా
ఫ్లై హై… టూ వింగ్స్ లేని వయస్సులై
స్కై మొత్తం చుట్టారోయ్
ఫ్లై హై… టు లైట్ వెయిట్ మనస్సులాయే
స్కై మొత్తం చుట్టారోయ్, ఎట్టారోయ్
ఏకువలోనా మాయ… సీకటిలోను మాయ
ఊసులు చానా మాయ… సూపులు కూడా మాయ
ఏకువలోనా మాయ… సీకటిలోను మాయ
ఊసంతా మాయ… సూపులు కూడా మాయ
మాయ మాయ మాయ మాయ
ఇంతలో ఎందుకో వింతగా ఇంత ఉల్లాసం
ఉందిలే పొందులో జంటగా కొంటె సల్లాపం
ఎద గోలగోల ఈల వేసే ఈ హాయిలో
జాలిపడి జావలీల జోలాలి పాడే ఈ గాలిలో
కాలం తరించేలా ఈ వేళా వేరే ప్రపంచాలే చేరాలా
మత్తులో ఎత్తులో కొత్తగా ఉంది యవ్వారం
ఇద్దెలే వద్దులే అడ్డుగా ఉంది బండారం
ఎహె దొరకని దొరగారు… గిరి దాటేనంట జోరు
గిరి దాటేనంట జోరు
హా, ఇరు పడవల పోరు చేసేను హొరాహొరు
చేసేను హొరాహొరు… ఇననంటే తెడ్డే జారు
ఉంటే అచ్చం మీరిద్దరొక హచ్చు హల్లుల్లా
అరె చెప్పండయ్యా ఈ చిక్కులని తప్పించేదేల్లా
ఫ్లై హై… టూ వింగ్స్ లేని వయస్సులై
స్కై మొత్తం చుట్టారోయ్
ఫ్లై హై… టు లైట్ వెయిట్ మనస్సులాయే
స్కై మొత్తం చుట్టారోయ్, ఎట్టారోయ్
ఏ, అడ్డడ్డే కొత్తవతారం ఎత్తేసారే మీరు
అసలేరి కించిత్తైనా శంకించేటివారు
మాయ మాయ వీర… సాహో ధీర శూర
నింగినేల పూరా స్వాహా చేసావేరా