Menu Close

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భారీగా పెరిగిన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య-Telugu News

మీ కొంచెం అజాగ్రత ప్రాణాలకే ప్రమాదాన్ని తీసుకొస్తుంది, మనకేమి కాదనుకుని అలసత్వం ప్రదర్శించారో మీ ప్రాణమే కాకుండా మీ వారి ప్రాణాలకు కూడా మీరు ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే… తప్పని సరిగా మాస్క్ దరించండి మీరు వాక్సిన్ తీసుకున్నా సరే.. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోండి..

ఇక మన ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భారీగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఊపందుకుంటుంది, దీనికి కారణం ముఖ్యంగా మనలోని అజాగ్రత్తనే .. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 49,737 శాంపిల్స్‌ పరీక్షించగా.. 1,179 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో 11 మంది కరోనాతో ప్రాణాలు వదిలారు.. చిత్తూరు్లో ముగ్గురు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు కన్నుమూశారు. ఇదే సమయంలో.. 1,651 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.

ఇక, ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన కరోనా టెస్ట్‌ల సంఖ్య 2,78,13,498కు చేరగా.. పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,40,408కు పెరిగింది.. ఇక, రికవరీ కేసులు 20,12,714కు చేరగా.. ఇప్పటి వరకు కరోనా బారినపడి మృతిచెందినవారి సంఖ్య 14,089కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 13,905 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.. ఇక, తాజా కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరిలో 192, చిత్తూరులో 190, కృష్ణా జిల్లాల్లో 167, పశ్చిమ గోదావరిలో 161 నమోదు అయ్యాయి

Limited Offer, Amazon Sales
Fire-Boltt Smart Watch at Lowest Price
Buy Now

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading