అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
మర్డర్ మిస్టరీలా కనిపిస్తున్నఈ మరణానికి సంబంధించిన మరిన్ని వివరాలు మరి కొంత విశ్లేషణ చేస్తేనే తెలుస్తుందని ప్రాజెక్ట్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ రేచెల్ వుడ్ అన్నారు.
ఇదే ప్రదేశంలో ప్రాచీన రాతి కట్టడాలను పోలిన ఒక చెక్క నిర్మాణం, రోమన్ అవశేషాలు కూడా లభించాయి.
గంటకు 225 మైళ్ళు ప్రయాణించే 362 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణ పనులు చేపడుతున్న ప్రాంతంలో నియోలిథిక్ యుగం నుంచి మధ్య యుగానికి సంబంధించిన అనేక అవశేషాలు శాస్త్రవేత్తలకు లభించాయి.
“4000 సంవత్సరాల క్రితం నాటి మానవ జీవనానికి సంబంధించిన ప్రదేశాన్ని కనిపెట్టడం ఆశ్చర్యకరంగా ఉంది” అని ఫ్యూజన్ జె వి లో పని చేస్తున్న డాక్టర్ వుడ్ అన్నారు.
నియోలిథిక్ యుగానికి చెందిన 65 మీటర్ల (213 అడుగుల) ఎత్తులో ఉన్న చెక్క స్తంభాలతో కూడిన అతి పెద్ద కట్టడం కూడా ఇక్కడ కనిపించింది. ఇది 3000 బిసి నుంచి 43 ఏడి మధ్య కాలంలోది అయి ఉండవచ్చు. వలయాకారంలో ఉన్న ఒక ఇల్లు, జంతువుల కోసం తవ్విన గుంతలు కూడా ఉన్నాయి.
రోమన్ యుగంలో ఈ గుంతలను మృత దేహాలను సమాధి చేయడానికి వాడేవారు. సీసపు లోహంతో తయారు చేసిన ఖరీదైన శవ పేటికలో ఉన్నత స్థాయి వ్యక్తి ఆస్థి పంజరం కూడా బయట పడింది.

కొన్ని యుగాలుగా ఉన్నత స్థాయి వ్యక్తులను సమాధి చేయడానికి వాడటమే ఈ స్థలం విశేషం అని డాక్టర్ వుడ్ అన్నారు.
ఇనుప యుగానికి చెందిన ఆస్థి పంజరం ఇక్కడ దొరకడం కాస్త భిన్నంగా ఉందని అన్నారు.
“వెల్ విక్ పొలాలలో దొరికిన అస్థిపంజరం ఒక రహస్యంలా కనిపిస్తోంది. ఈ మనిషి ఎలా చనిపోయారనేది అంతుబట్టట్లేదు. చేతులు కట్టేసి, తిరగబడిన తలతో పడి ఉండటానికి పెద్దగా మార్గాలేవీ ఉండవు’’ అని అన్నారు.
“ఈ దారుణమైన మృత్యువు గురించి మా ఆస్టియోలాజిస్టులు చెప్పగలరు” అని ఆయన అన్నారు.