Menu Close

Sarasalu Chalu Srivaru Song Lyrics In Telugu – Siva

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు
విరహాల గోల ఇంకానా వీలు కాదు

సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు
విరహాల గోల ఇంకానా వీలు కాదు
వంటిట్లో గారాలు… ఒళ్ళంతా కారాలే సారు
చురుకైన ఈడు ఒద్దన్నా ఊరుకోదు
విరజాజి పూలు వంటిట్లో వాడరాదు

సూర్యుడే చుర చుర చూసినా… చీరనే వదలడు చీకటే చెదిరినా
కాకులే కేకలు వేసినా… కౌగిలే వదలను వాకిలే పిలిచినా
స్నానానికే సాయమే రావాలనే తగువా
నీ చూపులే సోపుగా కావాలనే సరదా
పాపిడి తీసి పౌడరు పూసి… బైటికే పంపేయనా
పైటతో పాటే లోనికి రానా… పాపలా పారాడనా
తియ్యగా తిడుతూనే లాలించనా
సరసాలు చాలు శ్రీవారు… తాన నాన
విరహాల గోల ఇంకానా… ఊహు హు హూ

కొత్తగా కుదిరిన వేడుక… మత్తుగా పెదవుల నీడకే చేరదా
ఎందుకో తికమక తొందర… బొత్తిగా కుదురుగ ఉండనే ఉండదా
ఆరారగా చేరక తీరేదెలా గొడవా
ఆరాటమే ఆగదా సాయంత్రమే పడదా
మోహమే తీరే ముహూర్తమే రాదా… మోజులే చెల్లించవా
జాబిలే రాడా జాజులే తేడా… రాతిరే రాదా ఇక
ఆగదే అందాక ఈడు గోల

చురుకైన ఈడు ఒద్దన్నా ఊరుకోదు
విరజాజి పూలు వంటిట్లో వాడరాదు
ఊరించే దూరాలు… ఊ అంటే తియ్యంగా తీరు
సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు
లలలాల లాలాల లాలాల అహ హ్హా హ్హా ఆ హా ఆహ్హ

Like and Share
+1
1
+1
3
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading