ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
రా రా జగతిని జయించుదాం… రా రా చరితని లిఖించుదాం…
రా రా భవితని సవాలు చేసే… కవాతు చేద్దాం, తెగించుదాం
రా రా నడములు బిగించుదాం… రా రా పిడుగులు ధరించుదాం
రా రా చెడునిక దహించి వేసే… రహస్య వ్యూహం రచించుదాం
గదులు గడులు గడపలు దాటేయ్…
గడలు దడులు దరులను దాటేయ్…
ఎగిరెగిరెగిరి ఎగిరి ఎగిరెగిరి ఎగిరి… దశ దిశల కొసకు పోదాం
ఎరలు మొరలు చెరలను దాటేయ్…
తరులు గిరులు ఝరులను దాటేయ్…
ఎగిరెగిరెగిరి ఎగిరి ఎగిరిరెగిరి ఎగిరి… తుది గెలుపు మెరుపు చూద్దాం… రా
వి బ్రింగ్ ద గేమ్… యా వి’హావ్ కమ్ హియర్ టు స్టే
యా వి’హావ్ కమ్ హియర్ టు ప్లే…
రిపీట్, సింగ్ విత్ మి…
వి బ్రింగ్ ద గేమ్… యా వి’హావ్ కమ్ హియర్ టు స్టే
యా వి’హావ్ కమ్ హియర్ టు ప్లే…
సరిగా సరిగా మన శక్తులన్నీ… ఓ చోట చేర్చుదాం
త్వరగా త్వరగా మన తప్పులన్నీ… సరిదిద్ది సాగుదాం
చెమటే చెమటే చమురైనా… వాహనం దేహమే కదా
శ్రమకే శ్రమకే తను కోరుకున్న… గమ్యాన్ని చూపుదాం
తారల తలలు తాకుదాం… మన తీరుని తెలుపుదాం
ఆరని తపన ఆయుధం… ఇక పోరుని సలుపుదాం
గదులు గడులు గడపలు దాటేయ్…
గడలు దడులు దరులను దాటేయ్…
ఎగిరెగిరెగిరి ఎగిరి ఎగిరిరెగిరి ఎగిరి… దశ దిశల కొసకు పోదాం
ఎరలు మొరలు చెరలను దాటేయ్…
తరులు గిరులు ఝరులను దాటేయ్…
ఎగిరెగిరెగిరి ఎగిరి ఎగిరిరెగిరి ఎగిరి… తుది గెలుపు మెరుపు చూద్దాం… రా రా
రా రా జగతిని జయించుదాం… రా రా చరితని లిఖించుదాం
రా రా భవితని సవాలు చేసే… కవాతు చేద్దాం, తెగించుదాం
రా రా నడములు బిగించుదాం… రా రా పిడుగులు ధరించుదాం
రా రా చెడునిక దహించి వేసే… రహస్య వ్యూహం రచించుదాం… రా