Menu Close

Thanu Vethikina Thagu Jatha Song Lyrics In Telugu – Shailaja Reddy Alludu

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

తను వెతికిన తగు జత నువ్వేనని…
కను తెరవని మనసుకు తెలుసా అని…
బదులడిగిన పిలుపది నీదేనని…
తెరమరుగున గల మది విందా అని…
వెలుగేదో కనిపించేలా… నిన్నే గురుతించేలా

చుట్టూ కమ్మే రేయో మాయో మొత్తం కరగాలి…
ఒట్టు అంటూ నమ్మించే… నీ స్నేహం కావాలి…

తను వెతికిన తగుజత నువ్వేనని
కను తెరవని మనసుకు తెలుసా అని…
బదులడిగిన పిలుపది నీదేనని
తెరమరుగున గల మది విందా అని…

ఉరికే అల్లరి, ఉడికే ఆవిరి… ఎవరూ నా సరి లేరను వైఖరి
పొగరనుకో, తగదనుకో సహజ గుణాలివి…
వలదనుకో, వరమనుకో వరకట్నాలివి…
ఒడుపుగ వరస కలిపి… మహాశయా మగువనేలుకో… ఓ ఓ ఓ

నిను కలవక గడవదు కద కాలము…
నిను కలవక నిలవదు కద ప్రాణము…

కన్నెకళ్యాణికి కళ్ళెము వేయవా… అతిగారానికి అణకువ నేర్పవా
కసురుకొనే కనుబొమ్మలో… కలహము ఓడనీ
బిడియపడే ఓటమిలో… గెలుపును చూడనీ
చెలియక చెలిమి కలిపి తలపు తడిమి తడిని తెలుసుకో… ఓ ఓ ఓ

అదుపెరుగని దివి గంగని నేనట… అతిశయమున ఎగసిన మది నాదట
ఒడుపెరిగిన శివుడవు నీవేనట…
జడముడులతో నిలుపద… నను నీ జత

పనిమాలా బ్రతిమాలాలా… ప్రేమా పలకవదేల
నువ్వే నువ్వే నువ్వే నువ్వే కావాలంటున్నా…
పట్టు, విడుపు లేనేలేని… పంతం ఇంకానా…

Like and Share
+1
6
+1
8
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading