ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
నీ కన్నులలో నేను… నీ గుండెలలో నేను
అయినా ఎందుకు నేను… నాన్న మీతో లేను
నా అను మాటకు అర్ధమై ఉన్నదే మీరొకరూ
నీ ఒడి నుండి దూరమై… ప్రాణమే కన్నీరు
ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా
నాన్న అని పిలవాలని ఉంది
జ్ఞాపకాలు అన్ని గుర్తుకొచ్చి మళ్ళి
ప్రాణమంతా ఏదోలా ఉంది..!!
ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా
చిన్ననాటి లాగే వేలు పట్టి నీతో
కాలమంతా నడవాలని ఉంది
ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా
నాన్న అని పిలవాలని ఉంది
జ్ఞాపకాలు అన్ని గుర్తుకొచ్చి మళ్ళి
ప్రాణమంతా ఏదోలా ఉంది..!!
Like and Share
+1
3
+1
10
+1