ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ప్రేమ పరిచయమే దైవ దర్శనమే
ప్రేమ స్వరములలో దైవ స్మరణములే
అని తెలిసింది తొలిసారి నీ ప్రేమతో
మది మునిగింది నీ ప్రేమలో
ప్రేమ పరిచయమే దైవ దర్శనమే
ప్రేమ అడుగులలో దేవతార్చనలే
కోకిలసలు కోరుకొనని ప్రేమ తపస్సు మనదిలే
అతిథులెవరు ఎదురు పడని ప్రేమ తిథులు మనవే
అమృతములు ఎగసిపడిన ప్రేమ నదులు మనవే
చరితల కాగితాలలోన చదవలేని ప్రేమనే
నీలో చదివా ఈ క్షణాలలో
ప్రేమ పరిచయమే దైవ దర్శనమే
ప్రేమ అడుగులలో దేవతార్చనలే
హృదయగళము పాడుతున్న ప్రేమ గీతి మనదిలే
కనుల కలము రాసుకున్న ప్రేమ లేఖ మనదే
పెదవి ప్రమిద పంచుతున్న ప్రేమ జ్యోతి మనదే
మనుషుల ఊహాలోన సైతం ఉండలేని ప్రేమతో
ఎదుటే ఉన్నా ఈ క్షణాలలో
ప్రేమ పరిచయమే దైవ దర్శనమే
ప్రేమ అడుగులలో దేవతార్చనలే
అని తెలిసింది తొలిసారి నీ ప్రేమతో
మది మునిగింది నీ ప్రేమలో
ప్రేమ పరిచయమే దైవ దర్శనమే
ప్రేమ స్వరములలో దైవ స్మరణములే
అని తెలిసింది తొలిసారి నీ ప్రేమతో
మది మునిగింది నీ ప్రేమలో
ప్రేమ పరిచయమే దైవ దర్శనమే