ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
అమ్మా… ఆఆ ఆ ఆ ఆఆ
కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో
మనసుకు కాదు మరువతరమో
కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో
మనసుకు కాదు మరువతరమో
తల్లి గర్భ గుడిలో ఉన్నప్పుడు… రక్తముద్దై ఎదుగుతునప్పుడు
నవమాసాలు నిండుకునప్పుడు… అమ్మ ఇగ నేను కడుపులుండన్నప్పుడు
(అమ్మ ఇగ నేను కడుపులుండన్నప్పుడు) (అమ్మ ఇగ నేను కడుపులుండన్నప్పుడు)
కత్తిమీద సాము చేసినట్టుగా… కొండంత నొప్పుల అమ్మ తీసుకుంటు
జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి… బతికున్న శవములా సొమ్మసిల్లేనమ్మ
(బతికున్న శవములా సొమ్మసిల్లేనమ్మ) (బతికున్న శవములా సొమ్మసిల్లేనమ్మ)
అమ్మంటే ఎంతగొప్పదో… బ్రహ్మకైనా వర్ణించ వశమగునా
ఎన్ని జన్మలున్న కవుల కలములు… అమ్మ ప్రేమను రాసినా తరుగునా
పొద్దు పొద్దున లేచి నీ నామమును తలచి… నిన్ను పూజించిన నీ ఋణము తీరునా
అమ్మా… ఆ ఆఆ ఆ ఆఆ
కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో… ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
మనసుకు కాదు మరువతరమో
పచ్చి బాలింతయ్యి వెచ్చలు మింగుతూ… ఒళ్ళు నొప్పులు ఉన్నా ఓర్చుకొని అమ్మ
కక్కి ఏరిగిన పొత్తి గుడ్డల్ని పిండేసి… చాకిరీలో అమ్మొళ్ళు సబ్బోలే అరుగును
(చాకిరీలో అమ్మొళ్ళు సబ్బోలే అరుగును) (చాకిరీలో అమ్మొళ్ళు సబ్బోలే అరుగును)
చిన్ననోట అమ్మ అమ్మని అంటే… గావురంగ నే మారాము జేస్తే
పావురంగా అమ్మ చెంపను గిల్లి… ముద్దాడి సంకన ఎత్తుకుంటది
(ముద్దాడి సంకన ఎత్తుకుంటది) (ముద్దాడి సంకన ఎత్తుకుంటది)
రత్నమా, మెరిసే ముత్యమా… నా బంగారు తండ్రని అంటది
పడుకున్నా లేదా కూర్చున్నా… రామ బంటోలే కాపలా ఉంటది
చందమామను చూపి… గోరుముద్దలు పెట్టి
జోలపాడి అమ్మ పండుకోబెడతది… అమ్మా… ఆ ఆఆ ఆ ఆ ఆ
కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో… ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
మనసుకు కాదు మరువతరమో
తప్పటడుగులు వేస్తు ఉన్నప్పుడు… అదుపుతప్పి నే కింద పడ్డప్పుడు
అది చూసి అమ్మ బిర బిర ఉరికొచ్చి… దెబ్బ తాకెనాని ఒళ్ళంతా చూస్తది
(దెబ్బ తాకెనాని ఒళ్ళంతా చూస్తది) (దెబ్బ తాకెనాని ఒళ్ళంతా చూస్తది)
ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్న లేకున్నా… మేడమిద్దెలు లెక్కలేనన్ని ఉన్నా
కన్నకడుపే మేడమిద్దెలనుకుంటది… కడుపుతీపే ఆస్తి పాస్తులనుకుంటది
(కడుపుతీపే ఆస్తి పాస్తులనుకుంటది) (కడుపుతీపే ఆస్తి పాస్తులనుకుంటది)
జరమొచ్చి ఒళ్ళు కాలితే… అమ్మ గుండె నిండా బాధ ఉంటది
ఓ దేవుడా నా కడుపును… కాపాడమని వేడుకుంటాది
కొడుకు లేచి ఆడి నవ్వినప్పుడే… అమ్మ మొఖమున కోటి దీపాలు వెలుగును
అమ్మా… ఆ ఆఆ ఆ ఆఆ
కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో… ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
మనసుకు కాదు మరువతరమో
ఆత్మబలము తోటి గదుల గట్లను దాటి… మట్టి మీద చమట శక్తి ధారపోసి
ఇంటి సంసారంలో దీపమై వెలుగుద్ది… సుఖమన్నదెరుగని సుగుణాల జన్మరా
(సుఖమన్నదెరుగని సుగుణాల జన్మరా) (సుఖమన్నదెరుగని సుగుణాల జన్మరా)
కాయ కష్టం చేసి కడుపులో బువ్వై… డొక్క వెన్నుపూసనంటుకున్నా గాని
ఆత్మగల్ల తల్లి అడగులరాటము ఊపిరైనిస్తది బిడ్డల కోసము
(ఊపిరైనిస్తది బిడ్డల కోసము) (ఊపిరైనిస్తది బిడ్డల కోసము)
వయసు ఉడిగినా, శక్తి కరిగినా… అమ్మ ప్రేమ అణువంతైనా తరగదు
కన్ను మూసే చివరి ఘడియలొచ్చినా… కన్న పావురాలను మనసు విడువదు
అమ్మంటే మొక్కేటి రాతి బొమ్మ కాదు… జగమంతా జన్మంతా కొలిచేటి దైవము
అమ్మా… ఆ ఆఆ ఆ ఆఆ
కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో… ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
మనసుకు కాదు మరువతరమో