Menu Close

మీలో కాన్ఫిడెన్స్ ని పెంచుకోవడం ఎలా – The Confidence Code Book in Telugu


మీలో కాన్ఫిడెన్స్ ని పెంచుకోవడం ఎలా – The Confidence Code Book in Telugu

పుస్తకం పేరు: The Confidence Code
రచయితలు: క్యాటీ కే (Katty Kay), క్లెయిర్ షిప్మాన్ (Claire Shipman)
ప్రచురణ సంవత్సరం: 2014

Amazon Special Offers: Highest Rated Smart Watch - Buy Now

The Confidence Code Book in Telugu: ఈ పుస్తకం కొంతమందిలో కాన్ఫిడెన్స్ ఎందుకు తక్కువగా ఉంటుందో, దాన్ని ఎలా పెంపొందించుకోవాలో శాస్త్రీయంగా, అనుభవాత్మకంగా విశ్లేషిస్తుంది. రచయితలు క్యాటీ కే మరియు క్లెయిర్ షిప్మాన్ మహిళల మనస్తత్వాన్ని, వారు నిర్ణయాలు తీసుకునే తీరు, మరియు సమాజంలో ఎదురయ్యే సమస్యలను ఆధారం చేసుకుని, కాన్ఫిడెన్స్ అనేది ప్రాక్టీస్ చేయగలిగే నైపుణ్యం అని ఈ పుస్తకంలో వివరించారు.

The Confidence Code Book in Telugu
  • కాన్ఫిడెన్స్ అనేది పుట్టుకతో రాదు, అది ప్రతి రోజూ నేర్చుకోవడంతో వచ్చే నైపుణ్యం.
  • తెలివితేటలు ఉన్నా కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల చాలా మంది మహిళలు తమ సామర్థ్యాన్ని వినియోగించలేకపోతున్నారు.
  • మీరు పూర్తిగా సిద్ధం కాకపోయినా పరవాలేదు, ముందు పనిని ప్రారంభించండి. కాన్ఫిడెన్స్ మీ పనితోనే పెరుగుతుంది, ఎదురు చూస్తే కాదు.
  • పర్ఫెక్షన్ కోసం ఎదురుచూస్తూ ఉంటే మీరు అవకాశాలను కోల్పోతారు.
  • తప్పులు చెయ్యడం వల్ల మీ విలువ తగ్గినట్టు కాదు, ప్రతి తప్పు ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
  • పురుషుల కంటే మహిళలు ఓవర్‌థింకింగ్ ఎక్కువ చేస్తారు. ఇది వారి కాన్ఫిడెన్స్‌కు అడ్డంకి.
  • నిర్ణయం తీసుకోవడం ఆలస్యం చేయడం అంటే మీకు కాన్ఫిడెన్స్ తక్కువగా వుందని అర్దం.
  • “నేను తగినవాడిని కాను” లేదా “నేను తగినదానిని కాను” అనే ఆలోచన – ఇంపోస్టర్ సిండ్రోమ్ – ఇది పురుషులలో కంటే ఎక్కువ మహిళల్లో ఉంది.
  • నిజమైన కాన్ఫిడెన్స్ అంటే మీరు చెయ్యగలరన్న నమ్మకంతో ముందడుగు వేయడం.
  • చిన్న నిర్ణయాలు తీసుకుంటూ, వాటి ఫలితాలను చూసే ప్రతి ప్రయత్నం మీ కాన్ఫిడెన్స్‌ను బలపరుస్తుంది.
  • మీ విజయాలను గుర్తుంచుకోవడం వల్ల మళ్లీ అదే ఉత్సాహంతో ముందుకు సాగగలుగుతారు.
  • తప్పును అంగీకరించడమే నిజమైన కాన్ఫిడెన్స్ – తప్పును దాచడంలో కాదు.
  • ఇతరులతో పోల్చుకునే అలవాటు కన్నా మీ ఎదుగుదలపై దృష్టి పెట్టడం అవసరం.
  • తప్పులు – చెయ్యి – నేర్చుకో” అనే దృక్పథం మీ కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది.
  • మీరు నిలబడే విదానం, ముఖాభినయాలు కూడా మీలో ఉన్న కాన్ఫిడెన్స్‌ను ప్రభావితం చేస్తాయి.
  • ఇతరుల అభిప్రాయాలకంటే, మీ ఆత్మ నిబద్ధతపై మీరు విశ్వాసం కలిగి ఉండాలి.
  • మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునే బదులు, మీ నైపుణ్యాన్ని గుర్తించుకునే అలవాటు పెంచుకోండి.
  • ఫెయిల్యూర్లను భయపడకుండా స్వీకరించగలగడం వల్ల మీరు మళ్ళీ ప్రయత్నించగలుగుతారు – అదే నిజమైన కాన్ఫిడెన్స్.
  • కాన్ఫిడెన్స్ ఉన్న వారు అనేక సందేహాల మధ్య కూడా ముందుకు సాగగలుగుతారు.
  • జీవితంలో ఎదుగుదలకి తొలి అడుగు మీలో మీకు కాన్ఫిడెన్స్ కలగడమే.

ఈ పుస్తకం ముఖ్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో సంకోచించే వారి కోసం. ఇందులో చెప్పే సూచనలు కేవలం సిద్ధాంతంగా కాక, అనుసరించగల ప్రాక్టికల్ చిట్కాలుగా ఉంటాయి.

ఈ పుస్తకాన్ని పూర్తిగా ఇక్కడ చదవండి👇
The Confidence Code (English)

మరిన్ని పుస్తకాల గురించి ఇక్కడ చదవండి 👇
చిన్న అలవాట్లు, పెద్ద మార్పులు – Atomic Habits Book in Telugu
మీ జీవితాన్ని డబ్బుకి అమ్ముకోవద్దు – Your Money or Your Life Book in Telugu

Share with your friends & family
Posted in Book Recommendations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading