ఉదయాన్ని గొప్పగా ప్రారంబించండి – The Miracle Morning – తప్పకుండా చదవాల్సిన పుస్తకం
The Miracle Morning Book in Telugu: “మీ ఉదయం ఎలా ప్రారంభమవుతుందో, మీ రోజంతా కూడా అలాగే సాగుతుంది.”
పుస్తకం పేరు: The Miracle Morning
రచయిత పేరు: హాల్ ఎల్రాడ్ (Hal Elrod)
ప్రచురణ సంవత్సరం: 2012
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన పుస్తకం, అనేక భాషలలోకి అనువదించబడింది.

- “మీరు మారితేనే, మీ జీవితం మారుతుంది”
- విజయం మీ తలుపు తట్టదు… మీరే లేచి ముందడుగు వెయ్యాలి.
- మార్పు కోసం పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు. ప్రతి రోజు మనం చేసుకునే చిన్న చిన్న అలవాట్లు పెద్ద మార్పులకు దారి తీస్తాయి.
- మీరు లేచి మొదటి గంటను గౌరవిస్తే, అది మీ జీవితాన్ని గౌరవిస్తుంది.
- ఉదయం మీరు లేచి మొదటి గంటలో తీసుకునే నిర్ణయాలు, ఆ రోజంతా – చివరకి మొత్తం జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.
ఈ పుస్తకం చెప్పిన ఆరు అలవాట్లను మీ జీవితంలో అమలు చేస్తే, మీరు కోరుకున్న లక్ష్యాలను మీరు చేరుకుంటారు.
S.A.V.E.R.S అనే 6 అలవాట్లు రోజూ పాటించాలి:
Silence – మౌనం లేదా ధ్యానం: ఉదయం కొన్ని నిమిషాలు ధ్యానం చేయడం లేదా ప్రార్థన చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా మారుతుంది. కొత్త ఆలోచనలకు మార్గం లభిస్తుంది.
Affirmations – ఆత్మవిశ్వాసం: “నేను ధైర్యవంతుడిని”, “నా లక్ష్యాలను నేను చేరుకోగలను” వంటి వాక్యాలను ప్రతిరోజూ పలకడం ద్వారా మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
Visualization – మీ లక్ష్యాలను, గమ్యాలను మీరు చేరుకున్నట్టు ఊహించుకోండి: మన లక్ష్యాలను మనసులో స్పష్టంగా ఊహించుకోవడం. విజయం ఎలా కనిపిస్తుందో ఊహించుకోవడం ద్వారా మన మెదడు దాని కోసం పని చేయడం మొదలుపెడుతుంది.
Exercise – శారీరక వ్యాయామం: ఉదయం 10-20 నిమిషాల వ్యాయామం శరీరానికి శక్తిని ఇస్తుంది. ఇది శరీరం, మెదడు రెండింటికీ ఉత్తేజాన్ని ఇస్తుంది.
Reading – మంచి పుస్తకాలు చదువు: మంచి పుస్తకాలు చదవడం మన ఆలోచనలలో మార్పు తెస్తుంది. రోజుకు కనీసం 10 పేజీలయినా చదవడం అలవాటు చేసుకో.
Scribing – డైరీ లేదా మీ ఆలోచనలు రాయడం: డైరీ రాయడం లేదా దినచర్యలు, ధన్యవాదాలు వ్రాయడం మనలో స్పష్టతను తీసుకురాగలదు. ఇది మన జీవితాన్ని పరిశీలించడానికి సహాయపడుతుంది.
ఉదయం 5 గంటలకు లేచి ఈ అలవాట్లు అమలుపరిచితే జీవిత కచ్చితంగా మారుతుంది. ఈ అలవాట్ల ద్వారా ఆత్మవిశ్వాసం, ఉత్సాహం, దృష్టి, ఆరోగ్యం మెరుగవుతాయి.
- పుస్తకం మనలోని బలహీనతలను గుర్తించి, మెల్లగా వాటిని అధిగమించేందుకు మనల్ని ప్రోత్సహిస్తుంది.
- ఈ పుస్తకం మీరు సరిపడ నిద్రపోవాలని మరియు త్వరగా లేవమని చెబుతుంది. మంచి నిద్ర, మంచి ఉదయానికి బలమైన ఆధారము.
- ఏదైనా మొదలు పెట్టేందుకు ఎదురు చూడకండి, ఇప్పుడు మొదలుపెట్టండి. ప్రారంభమే అద్భుతానికి మొదలు.
- రోజుకు 1 గంట మాత్రమే కావాలి. ఆ సమయంలో SAVERS అలవాట్లు పాటిస్తే, మీ ఆత్మవిశ్వాసం, దృక్పథం, ప్రదర్శన అన్నీ మెరుగవుతాయి.
- ఇది కేవలం ఓ పద్దతి కాదు. మీరు బ్రతకడానికి కొత్త విధానం. ఇది ఒక భవిష్యత్తుని నిర్మిస్తుంది.
“ఉదయాన్ని గొప్పగా ప్రారంబించండి, రాత్రికి గర్వంగా పడుకోండి.”
పూర్తి పుస్తకం చదవాలనుకుంటే ఇక్కడ దొరుకుతుంది – The Miracle Morning
ప్రపంచాన్ని మార్చాలనుకుంటున్నావా – Make Your Bed – Book Recommendations