అమెజాన్ అడవి గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషియాలు – Top 20 Interesting Facts about Amazon Forest

- అమెజాన్ అడవి మొత్తం సుమారుగా 55 లక్షల చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. ఇది ఇండియా కన్నా పెద్దదే అని చెప్పవచ్చు!
- దాదాపు 9 దేశాల్లో విస్తరించి ఉంది – ముఖ్యంగా బ్రెజిల్, పెరూ, కొలంబియా లాంటి దేశాల్లో ఎక్కువ భాగం ఉంది.
- అమెజాన్ అడవిని భూమికి ఊపిరితిత్తులని పిలుస్తారు. ఎందుకంటే ఇది ప్రపంచంలో 20% ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది.
- అమెజాన్‌లో 40,000 కంటే ఎక్కువ మొక్కల జాతులు, 400కి పైగా పక్షుల జాతులు, 2.5 మిలియన్ల కీటకాల జాతులు ఉన్నాయి. జంతువులకు ఇది ఒక న్యాచురల్ హోం లాంటిది.
- ఒక్క అమెజాన్ అడవిలోనే ప్రపంచంలోని వన్యప్రాణుల 10 శాతం జీవిస్తాయి. ఇది ప్రకృతికి ఓ బంగారు బుట్ట లాంటి జాగ.
- ఇక్కడ ఉండే “స్లోత్స్” అనే జంతువులు చాలా ఆసక్తికరమైనవి. ఇవి గరిష్ఠంగా గంటకు 1 కిలోమీటర్ వేగంతో మాత్రమే కదులుతాయి.
- ఇక్కడ సంవత్సరానికి దాదాపు 200 నుంచి 300 రోజులు వర్షం పడుతుంది. అందుకే దీనిని “రెయిన్‌ఫారెస్ట్” అంటారు.
- వర్షం పడుతున్నప్పుడు అమెజాన్ అడవిలో గాలిలో తడి, వాసన, పచ్చదనంతో వాతావరణం అద్భుతంగా మారిపోతుంది. ప్రకృతి ప్రేమికులకు ఇది స్వర్గం లాంటిది.

- అమెజాన్ నదీ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద నది (నైల్ నది తర్వాత). దీని పొడవు దాదాపు 6,400 కిలోమీటర్లు.
- అమెజాన్ అడవిలో కొన్ని ప్రమాదకరమైన జంతువులు కూడా ఉంటాయి – అనాకొండా, పిరానా, జాగ్వార్ లాంటి వాటితో.
- కొన్ని బలమైన విషాన్ని కలిగి ఉన్న “డార్ట్ ఫ్రాగ్స్” కూడా ఇక్కడే ఉంటాయి. చిన్నగా ఉండే ఇవి, కానీ చాలా ప్రమాదకరమైనవి.
- అమెజాన్ అడవి లో ఉండే మొక్కల నుండి ఎన్నో ఔషధాలు తయారు అవుతున్నాయి. క్యాన్సర్, మలేరియా, మానసిక ఒత్తిడి వంటి అనేక రోగాలకు ఉపయోగపడే ఔషధాలు ఇక్కడి మూలికల నుంచే వస్తున్నాయి.

- ఇక్కడ ఉండే “మాకావ్” పక్షులు బహుశా అతి అందంగా ఉండే పక్షుల్లో ఒకటి. వీటి రంగులు కళ్లకు పండుగలాగ ఉంటాయి.
- అమెజాన్ అడవిలో ఇంకా కొన్ని గిరిజన జాతులు ఉన్నాయి. వాళ్లు ఇప్పటికీ ఆధునిక ప్రపంచానికి దూరంగా, తమ సంప్రదాయ జీవన శైలిలో జీవిస్తున్నారు.
- కానీ దురదృష్టవశాత్తూ, ప్రతి సంవత్సరం వేల ఎకరాల అడవి కనుమరుగవుతుంది – కార్బన్ ఉద్గారాలు, చెక్క కోసం, వ్యవసాయ పనుల కోసం.
- ఇది ప్రపంచంలో నేచురల్ ఫోటోగ్రఫీకి, పరిశోధనలకు ఒక అద్భుతమైన ప్రదేశం. అక్కడికి వెళ్ళడం రావడం అంటే ఓ అడ్వెంచర్ చెయ్యడమే.
- అమెజాన్ అడవిలో ఇంకా కొన్ని ప్రదేశాల్లో మనిషి అడుగుపెట్టలేదు. ఈ అడవిలో ఇంకా ఎన్నో తెలియని జీవజాతులు, మరెన్నో రహస్యాలు వుండివుండవచ్చు అని శాస్త్రవేత్తల నమ్ముతున్నారు.
అమెజాన్ అడవి నేపథ్యంగా తీసిన సినిమాలు, డాక్యుమెంటరీలు చాలానే ఉన్నాయి. “The Lost City of Z”, “Amazonia” వంటి సినిమాలు, సిరీస్‌లు ఈ అడవి అందాన్ని చూపించే ప్రయత్నం చేశాయి.
ఆఫ్రికా ఎందుకు ఇంకా పేదరికంలో ఉంది? ఈ నిజాలు తెలుస్తే షాక్ అవుతారు.!
“బాబా వంగా” ఆశ్చర్యాన్ని, భయాన్ని కలిగించే పేరు – Baba Vanga Future Predictions in Telugu
Like and Share
+1
+1
+1