గుడ్లు పెట్టి పాలిచ్చే జంతువులు తెలుసా మీకు – Amazing & Rare Animals in Telugu
- మన భూమిపై కనిపించే జంతువుల్లో క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు ముఖ్యమైన వర్గాలు.
- క్షీరదాలు (Mammals) అనగా పాలిచ్చే జంతువులు. మనుషులు, పశువులు ఇవే వర్గానికి చెందినవి.
- ఇవి పిల్లలకు నేరుగా జన్మనిచ్చి, పాలిచ్చి వాటిని పెంచుతాయి.
- అయితే, ఈ భూమిపై కొన్ని అరుదైన క్షీరదాలు ఉన్నాయి. ఇవి గుడ్లు పెట్టే క్షీరదాలు.
- ఇలాంటి అరుదైన గుడ్లు పెట్టే క్షీరదాలను మోనోట్రీమ్స్ (Monotremes) అంటారు.
- మోనోట్రీమ్స్ గుడ్లు పెడతాయి కానీ తల్లి పాలిచ్చే సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది, కానీ వీటికి చనుమొనలు ఉండవు.
- చర్మ గ్రంథుల ద్వారా పాలు ఉత్పత్తి చేస్తూ, పిల్లలకు పాలను అందిస్తాయి.
- ఇవి గుడ్లు పెట్టే విధానం, దాని సంరక్షణ, పిల్లల సంరక్షణ అన్నీ చాలా ప్రత్యేకమైనవి.
- మోనోట్రీమ్స్ జాతుల్లో ముఖ్యంగా ఐదు జంతువులు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తాయి.
Short-beaked Echidna (Spiny Ant Eater)
- ఇది ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపించే మోనోట్రీమ్ జాతి జంతువు.
- శరీరం మొత్తం ముళ్లతో కప్పబడి ఉంటుంది, గుడ్లు పెట్టే క్షీరదాలలో ఇది సాధారణంగా కనిపిస్తుంది.
- చీమలు, చెదపురుగులు వంటి చిన్న జీవులే దీని ఆహారం.
- పొట్టి ముక్కు, జిగటమైన నాలుకతో నేల తవ్వుతూ ఆహారాన్ని పట్టు చేసుకుంటుంది.
- ఆడ ఎకిడ్నాకు బొడ్డు భాగంలో సంచి ఉంటుంది.
- ఒకే ఒక్క మెత్తటి గుడ్డును ఉత్పత్తి చేసి, ఆ సంచిలో పెట్టి పొదుగుతుంది.
- బిడ్డ పుట్టాకా అదే సంచిలో ఉండి తల్లి చర్మగ్రంథుల నుంచి పాలు తాగుతూ పెరుగుతుంది.

Platypus
- తూర్పు ఆస్ట్రేలియాలో కనిపించే ఈ జీవి ప్రపంచంలోనే అత్యంత వింత క్షీరదాలలో ఒకటి.
- ఇది బాతులా ముక్కుతో కనిపిస్తుంది, తాబేలు వంటి కాళ్లు కలిగి ఉంటుంది.
- మగ ప్లాటిపస్ కాళ్ళ వద్ద విషపూరితమైన స్పర్ ఉంటుంది, ఇది ప్రమాదకరం కావొచ్చు.
- ప్లాటిపస్ గుడ్లు పెట్టి వాటిని సుమారు 10 రోజులపాటు వెచ్చగా ఉంచుతుంది.
- పిల్లలు పుట్టాకా తల్లి చర్మగ్రంథుల నుంచి విడుదలయ్యే పాలను తాగుతూ పెరుగుతాయి.

Sir David’s Long-beaked Echidna
- న్యూ గినియాలోని సైక్లోప్స్ పర్వతాలలో మాత్రమే కనిపించే అరుదైన ఎకిడ్నా జాతి.
- దీని పేరు ప్రఖ్యాత నేచురలిస్ట్ డేవిడ్ అటెన్‌బరో గారి పేరుపై ఉంది.
- దీని ముక్కు పొడవుగా, ఇరుకుగా ఉంటుంది.
- ఇది కూడా ఒకే ఒక్క గుడ్డును ఉత్పత్తి చేసి, సంచిలో పొదిగి, తల్లి చర్మగ్రంథుల ద్వారా పాలిస్తుంది.

The Western Long-beaked Echidna
- న్యూ గినియాలోని ఫోజా పర్వతాలలో కనిపించే ఈ జీవి చాలా అరుదైనది.
- ఇది నివసించే ప్రదేశాలు చాలా దట్టమైన అడవులు కావడంతో దీని గురించి పరిశోధనలు తక్కువగా జరిగాయి.
- మిగతా ఎకిడ్నాల్లా ఇది కూడా గుడ్లు పెట్టి, పిల్లలను సంచిలో ఉంచి పెంచుతుంది.

The Eastern Long-beaked Echidna
- న్యూ గినియాలోని అడవుల్లో కనిపించే ఈ జంతువు చాలా ప్రత్యేకమైన వేట నైపుణ్యాన్ని కలిగి ఉంటుంది.
- దీని పొడవాటి ముక్కు సహాయంతో మట్టిని తవ్వి పురుగులను, వానపాములను పట్టుకుంటుంది.
- ఇది ఒక గుడ్డును ఉత్పత్తి చేసి తల్లి సంచిలో ఉంచుతుంది.
- పొదిగే దశ తర్వాత కూడా పిల్లలు తల్లి చర్మగ్రంథుల ద్వారా పాలు తాగుతూ జీవిస్తాయి.

ప్రపంచాన్ని వణికించిన 10 మంది సైకో కిల్లర్స్ – 10 Psycho Killers in The World
రహస్యాలకు పుట్టిల్లు – సెంటినల్ ద్వీపం – Sentinel Island Mystery in Telugu
Like and Share
+1
+1
+1