మ్యాడ్ స్క్వేర్ మూవీ రివ్యూ – MAD Square Movie Review – 2025
MAD Square Movie Review – 2025: మ్యాడ్ చిత్రానికి సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ తెరకెక్కించారు. యూత్ ఫుల్ కామెడీ ప్రధాన బలంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ రూపొందించారు. మరి మ్యాడ్ స్క్వేర్ కామెడీ వర్కౌట్ అయిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ నిర్మాణంలో, కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో 2023లో విడుదలైన మ్యాడ్ చిత్రం మంచి విజయం సాధించింది. మ్యాడ్ చిత్రానికి సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ తెరకెక్కించారు. యూత్ ఫుల్ కామెడీ ప్రధాన బలంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ రూపొందించారు. మంచి అంచనాలతో ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
సినిమా ప్రారంభం నుంచి సుమారు 30 నిమిషాలు నాన్-స్టాప్‌గా నవ్వడమే ఉటుందని, దర్శకుడు కళ్యాణ్ శంకర్ మరోసారి హిట్ రైడ్ చేశాడని ఇప్పటివరకు వచ్చిన ట్వీట్స్ స్పష్టం చేస్తున్నాయి. లడ్డు గాడి పెళ్లి నేపథ్యంలో వచ్చే సీన్స్ అయితే పక్కా ఫన్ అందించాయని అంటున్నారు. టాక్సీవాలా హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ పాత్ర సినిమాలో స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తుందట. మొత్తంగా చెప్పాలంటే సినిమా బాగుంది అనే టాక్ అయితే వస్తోంది, దీంతో టాలీవుడ్ వర్గాల్లో మ్యాడ్ స్క్వేర్ పై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి.
కీలకమైన పెళ్లి సన్నివేశంలో కామెడీ పంచ్ లు బాగా పేలాయి. మొదటి 30 నిమిషాలు ఫుల్ కామెడీ అన్నట్లుగా సాగుతుంది. అయితే అక్కడక్కడా డల్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత కాస్త కథని పరిచయం చేశారు. కానీ ఈ చిత్రంలో కథ అంతగా గొప్పగా అనిపించదు. కొన్ని సన్నివేశాల్లో బలవంతంగా కామెడీ రుద్దినట్లు అనిపిస్తుంది.
లడ్డు క్యారెక్టర్ బావుంది. లడ్డు వాళ్ళ తండ్రితో వచ్చే సన్నివేశాలు, భాయ్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. మరికొందరు ఆడియన్స్ మాత్రం ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉందని అంటున్నారు. కథ చెప్పకుండా సీన్ బై సీన్ కామెడీ పంచ్ లు వేసుకుంటూ వెళ్లడమే దీనికి కారణం. ఇక ఫస్ట్ హాఫ్ లో గోవా ఎపిసోడ్ అంత బాగా వర్కౌట్ కాలేదని ప్రేక్షకులు అంటున్నారు. మొత్తంగా ఫస్ట్ హాఫ్ ని 30 నిమిషాల మంచి కామెడీతో లాక్కొచ్చారు.
ట్రైలర్ లో లడ్డు హంగామా ఎక్కువగా ఉన్నట్లు చూపించారు. లడ్డు కామెడీ బావుంది కానీ ఆశించిన స్థాయిలో లేదని కొందరు డిసప్పాయింట్ అవుతున్నారు. సెకండ్ హాఫ్ లో గోల ఎక్కువై కామెడీ తగ్గిపోయింది. లాజిక్ లేని కామెడీ సన్నివేశాలు బోరింగ్ గా అనిపిస్తాయి. ప్రియాంక జవాల్కర్ క్యారెక్టర్ సర్ప్రైజింగ్ గా ఉంటుంది అని అంటున్నారు.
నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ నవ్వించే ప్రయత్నం చేశారు. రెబ్బా మోనికా జాన్ స్పెషల్ సాంగ్ గ్లామర్ అట్రాక్షన్ గా ఉంటుంది. మ్యూజిక్ పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా మ్యాడ్ స్థాయిలో మ్యాడ్ స్క్వేర్ లేదని అంటున్నారు. ఈ చిత్రం యూత్ కి కనెక్ట్ అయ్యేదాన్ని బట్టే బాక్సాఫీస్ రిజల్ట్ ఉంటుంది.
ఇంతకీ మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో కామెంట్ చెయ్యడం మరవకండి.
Trending: క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సిరీస్ – Adolescence – Web Series Recommendation – 2025
రెండో అభిప్రాయం తప్పనిసరి | Telugu Moral Stories