Menu Close

ఎంపురాన్ మూవీ రివ్యూ – లూసిఫర్ 2 – Empuraan Movie Review – 2025


ఎంపురాన్ మూవీ రివ్యూ – లూసిఫర్ 2 – Empuraan Movie Review – 2025

నటీనటులు: మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, ఇంద్రజిత్ సుకుమార్, అభిమన్యు సింగ్, మంజు వారియర్, తదితరులు
దర్శకత్వం: పృథ్వీరాజ్ సుకుమారన్
విడుదల తేది: 27-3-2025

Amazon Special Offers: Highest Rated Smart Watch - Buy Now
ఎంపురాన్ మూవీ రివ్యూ - లూసిఫర్ 2 - Empuraan Movie Review - 2025

మోహన్ లాల్ హీరోగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘లూసీఫర్’ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే కదా. ఇపుడా మూవీకి సీక్వెల్ గా ‘ఎంపురాన్ – లూసీఫర్ 2’గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా లూసీఫర్ మాదిరి థ్రిల్ చేసిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథనం, టెక్నికల్ గా ఎలా వుంది?

దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమార్ లూసీఫర్ కథను ఎంతో గ్రిస్పింగ్ గా పకడ్బందీగా పొలిటికల్ గా మెప్పించాడు. ఇకో రెండు పార్ట్ ‘ఎంపురాన్’ అనే టైటిల్ తో తెరకెక్కించాడు. ఇక్కడ లూసీఫర్ అంటే దండించే వాడు. స్వర్గం నుంచి బహిష్కరించిన వాడు అనే అర్ధం ఉంటే… ఎంపురాన్ అంటే.. దైవం కంటే తక్కువ.. రాజు కంటే ఎక్కువ అనే అర్ధంలో ఈ సినిమాను తెరకెక్కించాడు. ముఖ్యంగా ఈ సినిమాలో స్టార్టింగ్ లో మైనారిటీ వర్గం వాళ్లపై మెజారిటీ వర్గం వాళ్లు దౌర్జన్యంతో హీరో కుటుంబాన్ని దారుణంగా చంపివేయబడతారు.

ఏదో కావాలనే ఇరికించి ఓ మెజారిటీ వర్గం వారిని శత్రువులుగా.. మైనారిటీ వర్గాన్ని బాధితులుగా చూపించాడు. మన దేశంలో బెంగాల్, కశ్మీర్, కేరళలో మెజారిటీ వర్గీయులుగా చెప్పుకుంటున్న వాళ్లు మైనారిటీలుగా ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు. అలాంటివి చూపించకుండా.. కావాలనే కథకు అవసరం లేకపోయినా.. మెజారిటీ అంటే హిందూ వర్గాన్నికావాలనే కించపరిచేలా ఈ సీన్స్ రాసుకున్నట్టు కనిపిస్తుంది

నటీనటుల యాక్టింగ్ ఎలా వుంది?

మోహన్ లాల్ .. స్టీఫెన్ నెడుంపల్లి అలియాస్ అబ్రహం ఖురేషీ పాత్రలో మెప్పించాడు. తాను ఎంత గొప్ప నటుడో ఈ సినిమాతో ప్రూవ్ అయింది. పృథ్వీరాజ్ సుకుమారన్ ఉన్నంత తన హీరోయిజం చూపించాడు. జితిన్ రామ్ దాస్ పాత్రలో నటించిన టోవినో థామస్ తన పాత్రుకు న్యాయం చేశాడు. నెగిటివ్ పాత్రలో ఒదిగిపోయాడు. మంజు వారియర్ తన పరిధి మేరకు నటించింది. ముఖ్యంగా ఈ సినిమాలో విలన్ గా నటించిన అఖండ శక్తి మోర్చా నాయకుడు బాబా బజరంగీ అలియాస్ బలరాజ్ పాత్రలో అభిమన్యు సింగ్ జీవించాడు. ఈయన క్యారెక్టర్ తో హీరో ఎలివేషన్స్ పండాయి. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.

ప్లస్ పాయింట్స్:
మోహన్ లాల్ నటన
నిర్మాణ విలువలు
ఎలివేషన్ సీన్స్

మైనస్ పాయింట్స్:
కథ, స్లో నేరేషన్
లాజిక్ లేని సీన్స్
సినిమా నిడివి

మీకెలా అనిపించిందో కామెంట్ చెయ్యండి.

Trendingక్రైమ్ థ్రిల్లర్ డ్రామా సిరీస్ – Adolescence – Web Series Recommendation – 2025

రెండో అభిప్రాయం తప్పనిసరి | Telugu Moral Stories

Share with your friends & family
Posted in Telugu Movie Reviews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading