Menu Close

Top 20 Telugu Quotes Text – టాప్ 20 కోట్స్


Top 20 Telugu Quotes Text – టాప్ 20 కోట్స్

“నిజం”
చెప్పేటప్పుడు
దీనంత బరువైంది ఉండదు.
చెప్పాకా దీనంత తేలికైంది ఉండదు.
“అబద్దం”
చెప్పేటప్పుడు
దీనంత తేలికైంది ఉండదు.
చెప్పాకా దీనంత
బరువైంది ఉండబోదు.

పుట్టినప్పుడు
ఊపిరి మాత్రమే ఉంటుంది,
పేరు ఉండదు.
చనిపోయినప్పుడు
పేరు మాత్రమే ఉంటుంది,
ఊపిరి ఉండదు.
ఆ పేరు చిరకాలం
ఉండేటట్టు జీవించు”

జీవితం సాఫీగా సాగాలంటే
నిన్ను మరిచిన వాళ్ళని
నువ్వు మర్చిపోవాలి.

నువ్వు దాచిన నిజం
నిన్ను నిద్రకు దూరం చేస్తుంది.
నువ్వు చెప్పే నిజం
నిన్ను మనుషులకు దూరం చేస్తుంది.,

టాప్ 50 రియాలిటీ కోట్స్ – Reality Quotes in Telugu

అరవని కుక్కలు ఉండవు,
విమర్శించని నోరూ ఉండదు,
ఈ రెండూ లేని ఊరే ఉండదు
ఏదేమైనా మన పని మనం
చేసుకుంటూ పోవడమే..!
అర్థమైందా రాజా..!

సముద్రం అందరికీ ఒకటే కానీ,
ఈత వచ్చిన వాడికి
ముత్యాలు దొరుకుతాయి.
వల వేయడం వచ్చిన వాడికి
చేపలు దొరుకుతాయి.
నిలబడి చూసిన వాడికి
కాళ్లు మాత్రమే తడుస్తాయి.
జీవితం కూడా అంతే,
అందరికి ఒకటే జీవితం.. కాకపోతే,
మన ప్రయత్న బలం బట్టి
ప్రతిఫలం దక్కుతుంది.!

సంస్కారం లేని పెద్దరికానికి
సలాం కొట్టే అంత
పెద్ద మనసు నాకు లేదు.

నీకు మనసు బాలేదు అని చెప్తే
నీకు దైర్యం చెప్పడానికి
ఎవరోకకరు వస్తారేమో .. !
అదే నీ దగ్గర డబ్బు లేదని చెప్పి చూడు
నీ వాళ్ళు కూడా నిన్ను వదిలేసి పోతారు.
“మానవ సంబంధాలన్ని ఆర్ధిక సంబంధాలే”

జీవితంలో.. ఇప్పటి వరకు
ఏం జరిగిందనేది నీకనవసరం,
ఇప్పటి నుంచి మళ్ళీ మొదలు పెట్టు
ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోకు.

ఓడిన ప్రతిసారి
లక్ష్యాన్ని మార్చుకుంటే
ఎప్పటికీ గమ్యాన్ని చేరలేవు.
ఓడిన చోటే
గెలుపు మార్గాలు దాగి ఉంటాయి
వాటిని గుర్తిస్తే
విజయం నీ సొంతమవుతుంది.

కష్టం
మనకు మాత్రమే కనిపించే దెయ్యం లాంటిది.
దాని గురించి ఎవరికి ఎంత చెప్పినా నమ్మాలనిపించదు.

Greatest Quotes in Telugu – తెలుగు కోట్స్

కోపం
ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపంలాంటిది.
ఒక్క క్షణం కంటే ఎక్కువ ఉండదు.
అది చేసే నష్టం మాత్రం మాములుగా ఉండదు.

జీవితం
ఒక రైలు ప్రయాణం లాంటిది.
మొదట్లో అందరూ మనతోనే ఉన్నట్టు ఉంటుంది.
ముగిసే లోపు ఒక్కొక్కరు దిగిపోతుంటే..
మనకోసం ఎవరు ఆగరు అన్న నిజం తెలిసిపోతూ ఉంటుంది.

వినరా సోదర వీరకుమారా.!

పేదవాడి “కష్టం, ఏడుపు”
ఎవరికీ కనిపించదు, వినిపించదు.
అదే ధనవంతుడైతే,
వాడి “నవ్వు” కూడా ఓ వార్త అవుతుంది.

ధనవంతుడు
తప్పు చేస్తే “చట్టం”
వాడి వెనుక ఉంటుంది.
అదే పేదవాడు
తప్పు చేయకపోయినా
కొన్నిసార్లు శిక్ష ఎదురౌతుంది.

నువ్వు పేదవాడివైతే
సలహాలు ఎక్కువగా వింటావు.
అదే నువ్వు ధనవంతుడివైతే
పొగడ్తలు ఎక్కువ వింటావు.

“పేదవాడు”
తిండి కోసం కష్టపడతాడు.
“ధనవంతుడు”
తిన్నది అరగడానికి కష్టపడతాడు.

తింటున్నంతసేపు “విస్తరాకు”
తినడం ఐపోయాక “ఎంగిలాకు”.
మన పరిస్తితి కూడా అంతే..
అవసరం ఉన్నంతవరకే మనకి “విలువ”.
అవసరం తీరాక మనల్ని కూడా
“ఎంగిలాకు” లానే చూస్తారు.

మనం గెలవడానికి, ఎదగడానికి చాలా మార్గాలు వున్నాయి – Most Inspiring Story in Telugu

ధనవంతుడు తినే ప్రతి ముద్ధ
ఎప్పుడో..
పేదవాడి చూపులతో ఎంగిలైపోయింది.

నిజాయితీగా ఉన్నవాళ్లకి
శత్రువులు ఎక్కువ ఉంటారు,
అబద్ధాలు చెప్పేవాళ్లకి
మిత్రులు ఎక్కువ ఉంటారు.

ఇక్కడ బంధం కంటే లాభమే ప్రదానమైనది.
అందుకే మన సొంత వాళ్ళు కూడా
మనల్ని మోసం చేస్తారు.

చాలా మందికి కనువిప్పు కలిగించే కథ – Emotional Story in Telugu

Like and Share
+1
0
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading