Menu Close

అన్నీ ఉన్నాయని మన పని వదిలేయకూడదు – Telugu Moral Stories

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

అన్నీ ఉన్నాయని మన పని వదిలేయకూడదు – Telugu Moral Stories

సుబ్బయ్య ఫలసరుకుల కొట్లో రోహిణి చంద్రం అనే ఎలుక దంపతులు ఉండేవి. మేలురకమైన జీడిపప్పు బాదం పప్పు తింటూ వెచ్చగా పెసలపప్పు డబ్బాలో పడుకునేవి. వాటికి రోజా అనే పెళ్ళి కెదిగిన కూతురుంది.

మనలా అంగళ్ళల్లో ఉండేవారికిస్తే మందులు పెడతారు కాదంటే బోనులు పెడతారు ఎప్పుడూ ప్రమాదం పొంచివుంటుంది. అదే పల్లెలో ఇస్తే స్వచ్చమైన గాలి హాయిగా వుండవచ్చని వాటి ఆలోచన.

ఓరోజు దంపతులు పల్లెకు వచ్చారు. పైరుపండించి వడ్లు బస్తాల కెత్తుతున్న రాజు అనే యువకుడు కనిపించాడు. అతనితో మాట్లాడి అమ్మాయి పెళ్ళి వైభవంగా జరిపించారు. అత్తగారు పంపిన తినుబండారాలు తింటూ పని మరచి పోయాడు.

ఓరోజు “మీఅమ్మా నాన్న పెద్దహోదాలో వున్నారుకదా! మనకేదైనా తెచ్చిపెడితే వారి అబ్బసొమ్ము ఏమైనా పోతుందా? అల్లుడు విలువ తెలియలేదు. అసలు అల్లుడంటే వారికి గౌరవం లేదు. వారి కంటికి నేను దద్దమ్మలా కనిపిస్తున్నాను” అంటూ రోజూ సోది మొదలెట్టాడు రాజు. ఆసంగతి తల్లిదండ్రులకు చెప్పింది రోజా.

వారు బండి మాట్లాడుకుని రెండు బస్తాలు వేరుశనగ పప్పు అల్లుడు ఇంట్లోవేశారు. ఆబగాతిన్నాడు. కడుపు నొప్పితో విరోచనాలు కాసాగాయి. తనకు తెలిసిన ఆకు పసరుతో నయం చేసింది అత్త.

“అత్తమ్మా! ఇకనుండి పట్నం నుండి ఎలాంటి తినుబండారాలు తేవద్దు అక్కడ అంతా కల్తీమయంగా వుంది. మాపల్లెలోనే మేలు వానలు కురిశాయి వ్యవసాయం మొదలు పెడతాను” అన్నాడు అల్లుడు. దంపతులు ఇంటికి ప్రయాణ మయ్యారు. మార్గమధ్యంలో “అల్లుడికి బాగా బుద్దిరావాలని నేనే వేరుశెనగలో విరోచనాల మాత్రలు కలిపాను.” అంది. భార్య తెలివితేటలకు భర్త ముక్కున వ్రేలుంచుకున్నాడు.

✍🏻జంజం కోదండ రామయ్య

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Moral Stories in Telugu, Chanda Mama Kathalu, Telugu Short Stories, Panchatantra Stories in Telugu, Short Moral Stories in Telugu, Pitta Kathalu,Telugu Stories, తెలుగు స్టోరీస్, తెలుగు కథలు, Telugu Moral Stories, Love Stories in Telugu, Telugu Love Stories, Great Stories in Telugu, Best Stories in Telugu, Telugu Stories for Kids, Telugu Stories for Children

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading