Menu Close

ఓ తల్లి టీచర్ కి రాసిన లేఖ – Life Lessons in Telugu


ఓ తల్లి టీచర్ కి రాసిన లేఖ – Life Lessons in Telugu

తన కుమారుణ్ణి స్కూల్లో చేర్చుతూ ఓ తల్లి టీచర్ కి రాసిన లేఖ. ఇది ప్రతి తల్లికి, తండ్రికి, టీచర్ కు, విద్యార్ధికి చేరాల్సిన లేఖ.

Amazon Special Offers: Highest Rated Smart Watch - Buy Now

మా అబ్బాయి ఇవాళే మొదటిసారి స్కూలుకి వస్తున్నాడు.కొంతకాలం అక్కడ అంతా వాడికి వింతగానూ కొత్తగానూ ఉండబోతోంది. అందుకే వాడితో మీరు కొంచెం సున్నితంగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నాను.

telugu quotes, telugu poetry, telugu stories, telugu jokes

ఈ సాహసకృత్యం వాణ్ణి సప్తసముద్రాలూ దాటి వెళ్ళేందుకు సాయపడవచ్చు. ఆ సాహసాల్లో యుద్ధాలూ, విషాదాలూ, దుఃఖాలూ వాడికి అనుభవంలోకి రావచ్చు. అలాంటి జీవితంలో వాడికి నమ్మకం, ప్రేమ, ధైర్యం తోడుగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది.

అందుచేత, దయచేసి మీరు దగ్గరుండి ప్రేమతో వాడు నేర్చుకోవలసినవన్నీ నేర్పిస్తారా? వీలైతే అవన్నీ సున్నితంగా నేర్పగలరా?

  • ఒక మిత్రుడుంటే ఒక శత్రువు కూడా ఉంటాడని నేర్పండి.
  • అందరు మనుషులూ న్యాయంగా ఉండరనీ, అందరూ సత్యసంధులు కారనీ వాడికి తెలియాలి.
  • ఒక దుష్టుడున్న చోట ఒక వీరుడు కూడా ఉంటాడనీ,
  • జిత్తులమారి రాజకీయ నేత ఉండే చోటే అంకితభావంతో పనిచేసే నేత కూడా ఉంటాడనీ చెప్పండి.
  • అప్పనంగా దొరికిన ఒక డాలరు కన్నా సొంతంగా సంపాదించుకున్న పది సెంట్లు ఎక్కువ విలువైనవని నేర్పండి.
  • మోసం చేసి గెలవటం కన్నా ఫెయిలవటం ఎక్కువ గౌరవంగా ఉంటుందని నేర్పండి.
  • ఓడిపోయినప్పుడు చక్కగా దాన్ని అంగీకరించటం, గెలిచినప్పుడు మనస్ఫూర్తిగా ఆనందించటం,.. నేర్పండి.

మనం గెలవడానికి, ఎదగడానికి చాలా మార్గాలు వున్నాయి – Most Inspiring Story in Telugu

  • అందరితో మృదువుగా ప్రవర్తించమనీ, కఠినంగా ఉన్న వాళ్ళతో కఠినంగా ఉండమనీ నేర్పండి.
  • అసూయకు వాణ్ణి దూరంగా ఉంచగలిగితే బావుంటుంది. చప్పుడు చెయ్యకుండా నవ్వటం నేర్పండి.
  • వాడు విచారంగా ఉన్నప్పుడు నవ్వటం నేర్పగలిగితే నేర్పండి.
  • కన్నీళ్ళు కార్చటం అవమానమేమీ కాదని నేర్పండి.
  • ఓటమిలో కూడా కీర్తి ప్రతిష్ఠలు ఉండవచ్చనీ, గెలుపులో నిరాశ ఉండవచ్చనీ నేర్పండి.
  • పుస్తకాలు ఎంత అద్భుతంగా ఉంటాయో నేర్పండి.
  • అందరూ వాడి ఆలోచనలు తప్పని అన్నప్పటికీ, వాటిని తను మట్టుకు గౌరవించటం నేర్పండి.
  • అందరూ దేన్నో అనుసరిస్తున్నా, తను అలా చెయ్యకుండా ఉండే మనోబలాన్ని మా అబ్బాయికి నేర్పండి.
  • అందరు చెప్పేదీ వినమనీ, సత్యమనే జల్లెడతో వడబోసి మంచిని మాత్రమే గ్రహించమనీ చెప్పండి.
  • తన ప్రతిభనీ, మేధస్సునీ ఎక్కువ ధర చెల్లించేవారికే అమ్మమని చెప్పండి. కానీ తన హృదయానికీ, ఆత్మకీ వెల నిర్ణయించద్దని నేర్పించండి.
  • అసహనం ప్రదర్శించే ధైర్యాన్నీ, ధైర్యంగా ఉండేందుకు ఓర్పునీ కలిగి ఉండనివ్వండి.
  • ఉదాత్తమైన ఆత్మవిశ్వాసం ఉండాలనీ, అప్పుడే మానవాళి మీదా దేవుడిమీదా వాడికి ఉదాత్తమైన విశ్వాసం ఏర్పడగలదనీ నేర్పించండి.

మీకు వీలైనంత వరకూ ప్రయత్నించి వాడిని మంచి పిల్లవాడుగా మలచండి. మీరు మలచగలరు. ఇది మా నమ్మకం.

ఇలా చేసే పిల్లలను తల్లిదండ్రులు సోమరుల్ని చేస్తున్నారు – మోరల్ స్టోరీస్ – Moral Stories in Telugu

Share with your friends & family
Posted in Telugu Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading