Menu Close

వారాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయి – Science behind Weekdays Names

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

వారాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయి – Science behind Weekdays Names

వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసా? “మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః” అంటే అర్ధం తెలుసా?

SUN’DAY
MO(O)N’DAY
TUESDAY
WEDNESDAY
THURSDAY
FRIDAY
SATUR(N)DAY

అంటే ఏమిటో తెలుసా…?

సూర్యహోర
చంద్రహోర
కుజహోర
బుధహోర
గురుహోర
శుక్రహోర
శనిహోర

వారాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయి - Science behind Weekdays Names

అంటే.. ఇవి సంస్కృత గ్రంధాలలో మన ఋషులు చేసిన వారాల విభాగము, ఇవి ఎంతో శాస్త్రీయమైనవి. ముందుగా ఈ వారాల పేర్లు సంస్కృతం నుండి గ్రీకుకు అక్కడి నుంచి లాటిన్ దేశాలకు ప్రయాణం చేశాయి! వారము అంటే ‘సారి’ అని అర్ధము. 1వ సారి, 2వ సారి… అంటాము కదా దాన్నే సంస్కృతంలో ప్రథమ వారము, ద్వితీయ వారము అని అంటారు!

కాస్త విపులంగా….భూగోళము బొంగరం మాదిరి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతోందని మన ఋషులు కనుగొన్నారు. భూగోళము తన చుట్టూ తాను ఒకసారి తిరగడాన్ని “ఒక వారం” అని పిలిచారు. ఒకసారి అన్నా ఒక వారం అన్నా ఒకటే. ఆకాశంలో గ్రహాల వరస ఎలా ఉందో, సూర్య సిద్ధాంత గ్రంధంలో రికార్డు చేయబడి ఉంది.

“మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః”
అనగా… పై నుండి క్రిందికి వరుసగా శని, గురు, కుజ, రవి, శుక్ర, బుధ, చంద్ర గ్రహాలున్నాయి. ఆకాశంలో గ్రహాలు ఈ వరసలో ఉంటే, వారాల్లో సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని అనే వరసలో ఎందుకున్నాయి? ఆ గ్రహాల వరసకి, ఈ వారాలకీ అసలు సంబంధం ఏమిటి? దీంట్లో ఏం లాజిక్ ఉంది? ఇది కేవలం మూఢ విశ్వాసమా? ఈ విషయాలు తెలియాలంటే, భారతీయ ఋషుల విజ్ఞానాన్ని లోతుగా పరిశీలించాలి.

భూమి తనచుట్టూ తాను తిరగడానికి 60 ఘడియలు పడుతుంది. ఈ 60 గడియలలో ఈ 7 గ్రహాల ప్రభావాలు ఎలా పడుతున్నాయో మన మహర్షులు గమనించారు. ఆ ప్రభావాల ప్రకారం లెక్క వేసుకుంటూ వస్తే ఒక “అహః” ప్రమాణంలో 24 భాగాలు కనిపించాయి. ఆ భాగాలను వారు “హోర” అన్నారు.

“అహః ప్రమాణం” అన్నా, “అహోరాత్ర ప్రమాణం” అన్నా ఒక్కటే. అహోరాత్ర అనే పదంలో మధ్య రెండక్షరాలు కలిపితే “హోర” అయింది. దీన్నే సాంకేతిక పదంగా తీసుకొని రోజుకి 24 హోరలు అన్నారు. ఈ హోర పదాన్ని అవర్(HOUR) గా మార్చి పాశ్చాత్యులు 24 అవర్స్(HOURS) అన్నారు. హోర శబ్దానికి అవర్ శబ్దానికి ఉన్న భాషాశాస్త్రపరమైన సామ్యాన్ని(పోలిక) పరిశీలించినప్పుడు కూడా మనం ఆశ్చర్యపోక తప్పదు.

ఒక్కొక్క గ్రహాల ప్రభావం అదే వరుసలో భూమిమీద ప్రసరిస్తూ చక్రభ్రమణం చేస్తూ ఉంటుంది. ఈ భ్రమణంలో చిత్రమేమిటంటే, ఇవాళ ఆదివారం అయితే ఈరోజు మొదటి హోర, సూర్యహోర వస్తుంది. ఇందాక చెప్పుకున్న “మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః” అనే వరుసలో… ఒక్కొక్క హోరనూ పంచుకుంటూ వస్తే మర్నాడు ఉదయానికి సరిగ్గా చంద్ర హోర ఉంటుంది. కనుక ఆ రోజు చంద్రవారం లేక సోమవారం.

మళ్లీ వరుసగా హోరలు పంచుకుంటూ వెళితే ఆ మర్నాడు ఉదయానికి మంగళహోర వస్తుంది. కనుక ఆ రోజు మంగళవారం, ఆ మరునాడు ఉదయానికి బుధహోర అనగా బుధవారం ఆ మరునాడు ఉదయానికి గురుహోర అది గురువారం. ఆ మర్నాడు ఉదయానికి ఈ శుక్రహోర అనగా శుక్రవారం. ఆ తరువాత ఉదయానికి శని హోర అది శనివారం. ఇలా సూర్యోదయ సమయానికి ఉండే హోర మీద ఏ గ్రహం ప్రభావం ఉంటుందో ఆ గ్రహమే ఆ రోజుకు పేరు అవుతుంది.

అసలు అలా ఎందుకు అనుకోవాలి అనే ప్రశ్న సహజం. ఎందుకనుకోవాలంటే సూర్యుడి ప్రభావం పరిపూర్ణంగా ఉన్న ఘడియలో సృష్టి ప్రారంభం జరిగిందని మన పురాణాలు నిర్ణయించాయి. దీన్నే మరోరకంగా చెప్పుకుంటే సృష్టి ప్రారంభంలో ఏ గ్రహం ప్రభావం అమలులో ఉందో ఆగ్రహం పేరే ఆదిత్యుడు. అంటే మొదటివాడు. అదే మొదటిరోజు.

అందువల్ల ఆ రోజు ఆదివారం అవుతుంది. ఆదివారం అన్నా, ఆదిత్యవారం అన్నా ఒకటే. అక్కడినుంచి ఒక హోరకు ఒక గ్రహంగా ఇప్పుడు చెప్పుకున్న “మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః” అనే వరుసలో గ్రహాలను పంచుకుంటూ వస్తే, మర్నాడు సూర్యోదయానికి మొదటి గ్రహం నుంచి నాలుగో గ్రహం యొక్క హోర వస్తుంది. ఈ లెక్క ప్రతిరోజు ఇలాగే సాగుతుంది. ఈ లెక్క ప్రకారం, హోరాధిపతుల వరస ఆదిత్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని ఈ విధంగా వస్తుంది.

అందుకే వారాల పేర్లు ఈ వరసలోనే వచ్చాయి. ఈ విధంగా ఆకాశంలో ఉండే గ్రహాల వరస వేరుగా, వారాల వరస వేరుగా అయింది. ఈ సత్యాన్ని అన్ని దేశాల్లో ఇలాగే పాటిస్తున్నా, ఇవాల్టి వైజ్ఞానిక లోకానికి కూడా “ఫలానా ఈ వారానికి ఈ పేరే ఎందుకు రావాలి?” అనే విషయం తెలియదు.

అది భారతీయులైన మహర్షులకే తెలిసిన సత్యం! అదీ…భారతీయ ఋషుల గొప్పదనం! నేటికైనా తెలుసుకోండి.. తెలియకపోయినా పాటించండి! సనాతన ధర్మ సంస్కృతిలో ప్రతీదీ మనిషికి పనికొచ్చే సైన్సే తప్ప వేరే కాదు.!!

అసలే కరువు, అందులో అధిక మాసం – Why Do We Have Leap Years?
మట్టి పాత్రల విశిష్టత – పదార్ధం ఉడకడం వేరు మెత్తబడడం వేరు

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading