Menu Close

జీవితాన్ని మార్చే పోస్ట్ – Most Inspiring Telugu Story

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

జీవితాన్ని మార్చే పోస్ట్ – Most Inspiring Telugu Story

నేను గర్వపడుతున్నా..
నేనే మాత్రమే కాదు
నాతో పాటు మీరు కూడా
మిమ్మల్ని మీరు చూసి గర్వపడాలి.

ఎందుకో తెలుసా
మనం ప్రయత్నిస్తున్నాం..!
అలసిపోయి బద్ధకంగా అనిపించినా..?
నిద్రలేవాలి అని అనిపించకపోయినా..?
ఈ నాటకీయ సమాజంలో ఇమడలేక
ఒంటరిగానే వుండాలి అని అనిపిస్తున్నా..?

తప్పక, కుటుంబం కోసం, మన వారి కోసం
రేపటి కోసం..
నిద్రలేచి, శరీరాన్ని బారంగానే నెట్టుకుంటూ
నలుగురితో కలిసి పనిచెయ్యడానికి బయలు దేరుతున్నాం.

మనది కానీ రోజు,
మనం ఒడిపోతాం, కూలిపోతాం, నిరాశ చెందుతాం.
అయినా, ఆగకుండా ప్రతిరోజు మనం ప్రయత్నిస్తున్నాం.
మరో రోజుని పూర్తి చేసేందుకు ఓ చిన్న ప్రయత్నం చేస్తున్నాం..
వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలకుండా గెలిచేందుకు ఓ చిన్న ప్రయత్నం చేస్తున్నాం.

ఈ చిన్న చిన్న ప్రయత్నాలు మనల్ని ఎక్కడి వరకు తీసుకెళ్తాయో తెలియదు,
కానీ, కచ్చితంగా తెలుసు.. అరే అప్పుడు ఆ చిన్న ప్రయత్నం చేసుంటే బాగుండేదే
అనే బాధ నుండి మాత్రం మనల్ని చాలా దూరంగా తీసుకు వెళ్తాయి.
ఏమో..,
ఇంకా,
మనం చేసే ఈ చిన్న చిన్న ప్రయత్నాలే జీవితంలో మనకి ఎన్నో అద్బుతాలను పరిచయం చేస్తాయేమో..
మనం చేసే ఈ చిన్న చిన్న ప్రయత్నాలే ఓ రోజు.. జీవితంలో వున్న మాధుర్యాన్ని మనకి రుచి చూపిస్తాయేమో..
మనం చేసే ఈ చిన్న చిన్న ప్రయత్నాలే మనల్ని రేపటి ప్రపంచానికి ఓ గొప్పవాడిగా పరిచయం చేస్తాయేమో..
మనం చేసే ఈ చిన్న చిన్న ప్రయత్నాలే చరిత్రలో కథలు అవుతాయేమో..

అందుకే ప్రయత్నిద్దాం, మన ప్రయత్నం ఎంత చిన్నదైన పరవాలేదు, మన శక్తికి తగ్గట్టుగా.. ప్రయత్నిద్దాం..

రచయిత: సురేష్ సారిక

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి.

సరైన attributes లేకుండా ఈ పోస్ట్ ని కాపీ పేస్ట్ చెయ్యడం నిషిద్ధం. చేసినచో చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. షేర్ చేసేటప్పుడు రచయిత పేరు మరియు source of the story – TeluguBucket.com తప్పకుండా include చెయ్యండి.

మరిన్ని కథలు ఇక్కడ చదవండి.
ఆ తృప్తి మరెందులోనూ లేదు..!
నిజమైన సంతుప్తి ఎక్కడ దొరుకుతుందో తెలుసా..?

Like and Share
+1
0
+1
1
+1
0

Subscribe for latest updates

Loading