Menu Close

హనుమంతుడుని కార్యదీక్షాపరుడు అని ఎందుకు అంటారో తెలుసా..?

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

Interesting Facts about Lord Hanuman

హనుమంతుడు సూర్యుడి దగ్గర విద్యను నేర్చుకోవాలనుకున్నాడు. వెంటనే వెళ్లి సూర్యనారాయణుడికి నమస్కరించి విద్యలు నేర్పమని వినయంగా అడిగాడు. అందుకాయన ‘‘నేను ఒకచోట కూర్చుని పాఠం చెప్పలేనని’’ చెప్పాడు.

Interesting Facts about Ayodhya

ఎందుకంటే ఒకేచోట కూర్చునుంటే లోకానికి ఇబ్బంది. ఉదయాన్నే బయల్దేరతాడు. అదేవేగంతో వెళ్ళిపోతుంటాడు. బ్రహ్మాండాలన్నీ చుట్టివస్తాడు. అంతవేగంతో వెడుతున్నవాడు చెబుతున్న మాటలు వినడం కష్టం. పైగా ఎప్పుడూ ఒకేలా ఉండడు. ఉదయం బయల్దేరినప్పుడు దగ్గరగా వెళ్ళి వినవచ్చు. మధ్యాహ్న సాయంకాలాలు అలా కుదరదు. మార్తాండుడై ఉంటాడు. భరించడం కష్టం.

సాధారణంగా ఎదురుగా కూర్చుని ముఖం కనబడేటట్లుగా ఉండి చెపుతుంటే మాటలను పట్టుకోవడం తేలిక. కానీ ఇక్కడలా కుదరదు. అలాగని గురువుగారి పక్కన పరుగెడుతూ నేర్చుకుందామా అంటే… రెండు చెవులతో స్పష్టంగా వినడం కుదరదు. గురువుగారికి పృష్ఠభాగం చూపకూడదనే నియమం వల్ల ముందుండడానికి వీల్లేదు. ఇక ఏమిటి మార్గం..!

గురువుగారి ఎదురుగా నిలబడి, వెనకకు పరుగెడుతూ అదీ సూర్యుడితో సమానంగా, ఒక్క మాట విడిచిపెట్టకుండా నాలుగు వేదాలు, 9 వ్యాకరణాలు నేర్చుకున్నాడు.

ఇదీ హనుమ వైభవం. అలా నేర్చుకోగలగాలంటే ఆయనకు ఎంత శ్రద్ధ, భక్తి ఉన్నాయో ఆలోచించండి. లోకంలో ఎన్నో అవతారాలున్నాయి. హనుమ అవతారం మాత్రమే అంత వైశిష్ట్యం పొందడానికి కారణం, అంత శ్రమకోర్చి గురువుగారి దగ్గర పాఠం నేర్చుకోవడమే.

హనుమ జీవితం ఒకసారి గమనించండి:

ఆయన పుట్టీపుట్టగానే సూర్యుడిని చూసి పండనుకొని ఆకాశానికెగిరిపోయాడు. ఇంద్రుడు వజ్రాయుధం పెట్టికొడితే ఎడమ దవడ విరిగి అక్కడినుంచి కిందపడ్డాడు. ఆ తరువాత దేవతలందరూ వచ్చి ఎన్నో శక్తులు ధారపోశారు.

అన్ని శక్తులు పొందిన హనుమ తన జీవితంలో ఓ గంట విశ్రాంతి తీసుకున్నట్లు మీరెప్పుడయినా విన్నారా! లోకంలో ఎవ్వరూ ఎప్పుడూ చేయడానికి సాహసించని కార్యాలను ఆయనొక్కడే సంకల్పించాడు.

నూరుయోజనాల సముద్రాన్ని ఎవరు దాటగలరు? అటువంటిది దాటడమే కాకుండా తానొక్కడే రామభక్తుడిగా ఉండి చుట్టూ రాక్షసులున్నా నిర్భయంగా రావణాసురుడితో మాట్లాడి అంతే వేగంతో తిరిగి వస్తాడు.

అంతటి బలవంతుడు, శక్తిమంతుడు, అంతటి పండితుడు, వ్యాకరణవేత్త, తనగురించి తాను చేసుకున్న ఒక్క పని చూపగలరా! ఎన్ని గ్రంథాలు వెతికినా ఒక్కటీ కనిపించదు. కార్యదీక్షాపరుడు అలా ఉండాలి.

Like and Share
+1
2
+1
0
+1
0

Subscribe for latest updates

Loading