ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
డబ్బుకి లోకం దాసోహం – Importance of Money
నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళాలి అన్న,
నాలుగు గంటలు మనం ప్రశాంతంగా పడుకోవాలి అన్న,
నచ్చిన మనిషి మన పక్కన ఉండాలి అన్న,
మన దగ్గర ఉండాల్సింది డబ్బు మాత్రమే.
పదిమందిలో మన గౌరవాన్ని నిలబెట్టేది డబ్బే..
అయినవాళ్ళ ముందు నిస్సహాయుకుడిగా నిలబెట్టేది కూడా డబ్బే.
కట్నం డబ్బులు తేని భార్యని బానిసగా చూస్తాడు భర్త.
ఎక్కువ డబ్బులు సంపాదించలేని భర్తని లోకువగా చూస్తుంది భార్య.
డబ్బులు కూడబెట్టడం చేతకాని తండ్రిని
అసమర్థులుగా చూస్తారు బిడ్డలు.
సంపాదించడం చేతకాని బిడ్డలని
చేతకాని వాళ్ళకింద చూస్తాడు తండ్రి.
అదే డబ్బుల కోసం ఒక మగవాడు
కుటుంబాన్ని, ఐనవాళ్ళని వదిలి రాష్టాలు దేశాలు దాటి వెళ్తాడు.
ఆస్తి పంపకాలలో తేడా ఉందని
తోడబుట్టిన వారితో సంవత్సరాలు మాట్లాడకోని అన్నదమ్ములు.
పంపకాలలో అమ్మ బంగారం ఇవ్వలేదని
పుట్టింటి గడప తొక్కనని శపథం చేసే అక్కాచెల్లెళ్ళు.
అందుకే డబ్బుని గౌరవించండి.
పోయేటప్పుడు ఏమీ పట్టుకొని పోకపోయినా
మనం పోయాక మన శవాన్ని తీయడానికి కూడా డబ్బే కావాలి.
“డబ్బుకి లోకం దాసోహం”
డబ్బుకి లోకం దాసోహం – Importance of Money