ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
10 Best Jokes in Telugu – తెలుగు జోక్స్
కరెంటు పోయి విసుగ్గా బాల్కనీ లో కూర్చుని ఉన్న భార్యను చూసి
అప్పుడే ఇంటికి వచ్చిన భర్త అక్కడేం చేస్తున్నావు అని అడిగాడు.
దానికి ఆమె
“ఆలి పోయిన వాని ఆలిని
వెతక బోయిన వాని తల్లి మగని కోసం కూచున్నా అంది”
అర్థం కాక అయోమయంలో ఉన్న భర్తతో భార్య ఈవిధంగా చెప్పింది ఏమిటంటే.
ఆలి పోయిన వాడు “శ్రీరామ చంద్రుడు”
వెతక బోయిన వాడు “హనుమంతుడు”
అతని తల్లి “అంజనాదేవి”,
ఆమె మొగుడు “వాయుదేవుడు”
అంటే “గాలి” కోసం, బాల్కనీ లో కూచున్నా అని చెప్పింది “భార్యామణి”
ఇంట్లో భార్య అరవడం మొదలు పెట్టగానే
కిటికీలు , తలుపులు మూసే వాడు ” మనిషి ” .
వాటిని మూయటంతో పాటు
టీవీ సౌండ్ పెంచే వాడు ” పెద్దమనిషి ” ,
తిట్లు , అరుపులు వినిపిస్తున్నా పట్టించుకోకుండా
తన పని తాను చూసుకునే వాడు ” మహామనిషి ” .
ఏమీ వినపడనట్టు
చొక్కా వేసుకొని బయటకు వెళ్లే వాడు ” జ్ఞాని ” .
Beggar: అమ్మ తల్లి ధర్మం చేయమ్మా నేను మూగవాన్ని మాట్లాడలేను.
Lady: పక్క ఇంట్లో పోయి అడుగు నాకు చెవుడు వినపడదు.
కొంతమంది మతం కోసం గొడవపడుతుంటారు
మరి కొంతమంది డబ్బుకోసం గొడవపడుతుంటారు
ఇంకొందరు కులంకోసం గొడవపడుతుంటారు
ఒక్క భార్యా భర్తలు మాత్రమే.
దేనికో తెలియకుండా గొడవపడుతుంటారు.
సంతోషికి బ్లడ్ క్యాన్సర్. ఇంకా ఎక్కువ రోజులు బతకదని చెప్పేశారు.
డాక్టర్. మంచం మీదున్న సంతోషి వాళ్లాయన రాజాను పిలిచింది.
సంతోషి మీరు నాకో మాట ఇవ్వాలి.
రాజా: చెప్పు సంతూ… నీకోసం ఏమయినా చేస్తాను.
సంతోషి: నేను చచ్చిపోయాక మీరు పెళ్లిచేసుకోవాలి.
అదీ నా స్నేహితురాలు రమనే చేసుకోవాలి.
రాజా: నేను మరెవ్వర్నీ పెళ్లిచేసుకోను.
సంతోషి: కాదు, మీరు తప్పకుండా రమను చేసుకోవాలి.
రాజా: నీకు అంత ఇష్టమా తనంటే.
సంతోషి: ఇష్టమా పాడా. మీతో పెళ్లికి నన్ను ఒప్పించింది అదే.
ఇంతకింతా అనుభవించాలి అది కూడా.
పోలీస్: నువ్వు ఎక్కడుంటావ్?
నేను: మా అమ్మ నాన్నలతో..
పోలీస్: వాళ్ళు ఎక్కడుంటారు?
నేను: నాతోనే..
పోలీస్: మీరందరు ఎక్కడుంటారు?
నేను: కలిసే ఉంటాం.
పోలీస్: ఒరేయ్ ఇంతకి మీ ఇల్లు ఎక్కడ?
నేను: రవి గాడి ఇంటి పక్కన.
పోలీస్: వాడిల్లు ఎక్కడ?
నేను: చెప్తే మీరు నమ్మరు.
పోలీస్: చెప్పరా బాబు..!
నేను: మా ఇంటి పక్కనే..
భార్య: ఏవండీ… మన అమ్మాయి
ప్రేమలో పడిందేమో అని అనుమానంగా ఉందండి..?
భర్త: ఎందుకే ఆ అనుమానం??
భార్య: ఏమోనండి…
ఈ మధ్య పాకెట్ మనీ అడగట్లేదండీ.. అందుకే..!
షాపులో ఒకమ్మాయి
4 గంటల నుండి చెప్పులు ట్రయల్ చూస్తోంది.
ఒక్కటి కూడా నచ్చడం లేదు.
ఆఖరిసారి ఒకటి సెట్ అయ్యింది.
వీటి ధర ఎంత?
ఫ్రీగా తీసుకెళ్ళండి..!!
ఏం.. ఎందుకు?
అవి మీవే..!!
10 Best Jokes in Telugu – తెలుగు జోక్స్